త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aya Sher | పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ పాట‌తో ఊగిపోయిన ఉప్ప‌ల్ స్టేడియం..

Aya Sher | ఐపీఎల్ అంటే ఫోర్లు, సిక్స‌ర్ల హోరే కాదు.. ఓ పాట కూడా స్టేడియాన్ని ఒక ఊపు (Aya Sher) ఊపేసింది. హీరో నానీ న‌టిని ఆ మూవీలోని పాట‌ను మ్యాచ్ మ‌ధ్య‌లో ప్లే చేశారు.

G

Telangana | Published On Apr 19, 2026, 9.50 am IST

Aya Sher | పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ పాట‌తో ఊగిపోయిన ఉప్ప‌ల్ స్టేడియం..
Advertisement

Aya Sher | త్రినేత్ర‌.న్యూస్‌: ఐపీఎల్ అంటే ఫోర్లు, సిక్స‌ర్ల హోరే కాదు.. ఓ పాట కూడా స్టేడియాన్ని ఒక ఊపు (Aya Sher) ఊపేసింది. హీరో నానీ న‌టిని ఆ మూవీలోని పాట‌ను మ్యాచ్ మ‌ధ్య‌లో ప్లే చేశారు. దీంతో ఫ్యాన్స్ పూన‌కాల‌తో ఊగిపోయారు. ప్రేక్ష‌కులు కూడా గొంతు క‌ల‌ప‌డంతో స్టేడియం మొత్తం హోరెత్తింది.

శ‌నివారం సాయంత్రం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ (SRH vs CSK) త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 194 ర‌న్స్ చేసింది. అయితే ల‌క్ష్య ఛేద‌న‌లో సీఎస్‌కే 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులే చేయగలిగింది. దీంతో 10 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్ మ‌ధ్య‌లో నానీ `ద ప్యార‌డైజ్` మూవీలోని `పొట్టు పొట్టు ఆక‌లుంది.. ఆయా షేర్` పాట‌ను డీజే షేర్ చేశారు. దీంతో స్టేడియం ఒక్క‌సారిగా ద‌ద్ద‌రిల్లిపోయింది. ‘ఆయా షేర్’ క్రికెట్ అభిమానులు కూడా రాగం అందుకోవడంతో స్టేడియం గర్జించింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఉప్పల్ స్టేడియం గర్జించిందని పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

మీరూ ఒక‌సారి వినేయండి..

Advertisement
Advertisement