త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే – నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్స‌వ్వొద్దు

థియేట‌ర్ల‌లో ఒక్య రోజు గ్యాప్‌లో రిలీజైన నాని ది ప్యార‌డైజ్‌, కీర్తి సురేష్ డోర‌తీ సినిమాలు ఒకేసారి ఓటీటీలోకి వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. వీటితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే?

N

News | Published On Oct 23, 2026, 5.23 pm IST

OTT Releases |   ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే –  నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్స‌వ్వొద్దు
Advertisement

OTT Releases | ఈ వారం నాని ప్యార‌డైజ్‌తో పాటు కీర్తి సురేష్ డోర‌తీ సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. వీటితో పాటు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించిన వ‌రం వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌

ది ప్యార‌డైజ్ (తెలుగు)

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ది ప్యార‌డైజ్ మూవీ గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, సంపూర్ణేష్‌బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.
డోర‌తీ (త‌మిళ్‌)
కీర్తి సురేష్ హీరోగా న‌టించిన డోర‌తీ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ట్రాన్స్‌జెండ‌ర్ స‌మ‌స్య‌ల‌ను సందేశాత్మ‌కంగా కోణంలో ఈ సినిమాలో చూపించారు ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు. ఈ సినిమాకు ఇళ‌య‌రాజా మ్యూజిక్ అందించారు.
ధూమ‌కేతు (మ‌ల‌యాళం)
మ‌ట‌ర్ గ‌స్తీ వెబ్‌సిరీస్ (హిందీ)
ది లాస్ట్ హౌజ్ ఆన్ ది లెఫ్ట్ (ఇంగ్లీష్‌)
గ‌జ‌బ్ రాత్ (హిందీ)

ఆహా వీడియో

నా వైఫ్ మిస్సింగ్ (తెలుగు)

కొత్త బంగారు లోకం జోడీ వ‌రుణ్ సందేశ్‌, శ్వేత‌బ‌సు ప్ర‌సాద్ హీరోహీరోయిన్లుగా న‌టించిన నా వైఫ్ మిస్సింగ్ సినిమా నేరుగా ఆహా ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు స్వాతిప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

జీ5 ఓటీటీ

అయ్య‌న‌మానే 2 వెబ్‌సిరీస్ (క‌న్న‌డ‌)
స‌ట్ట‌మామ్‌నీదియుమ్ (త‌మిళం)
సుమోదీదీ (హిందీ)
ది ఇన్వైట్ (ఇంగ్లీష్‌)

ఈటీవీ విన్ ఓటీటీ

ఫ్లైట్ మ‌హా (తెలుగు)

జియో హాట్ స్టార్

వ‌రం వెబ్‌సిరీస్ (తెలుగు)

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించిన తెలుగు వెబ్‌సిరీస్ వ‌రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్‌కు ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెండు ఎపిసోడ్స్ మాత్ర‌మే ఈ వారం రిలీజ‌య్యాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఐ ఐయామ్ హ్యాండ్స‌మ్ (తెలుగు)
చార్ యార్ వెబ్‌సిరీస్ (హిందీ)

 

Advertisement
Advertisement