త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Auto Strike | తెలంగాణ‌లో ఆటోల స‌మ్మె బంద్..

Auto Strike | తెలంగాణలో 24 అర్ధరాత్రి నుంచి ఆటో సేవలు నిలిపివేస్తామని ఆటో యాప్‌ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ఆటో యూనియ‌న్ల జేఏసీ ఆదివారం రాత్రి ప్ర‌క‌టించింది.

S

Telangana | Published On Aug 23, 2026, 9.32 pm IST

Auto Strike | తెలంగాణ‌లో ఆటోల స‌మ్మె బంద్..
Advertisement

Auto Strike | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో 24 అర్ధరాత్రి నుంచి ఆటో సేవలు నిలిపివేస్తామని ఆటో యాప్‌ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ఆటో యూనియ‌న్ల జేఏసీ ఆదివారం రాత్రి ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ తొలి వారంలో కార్మిక‌, ర‌వాణా మంత్రులు.. ఆటో యూనియ‌న్ల జేఏసీతో చ‌ర్చ‌ల‌కు హామీ ఇచ్చిన నేప‌థ్యంలో స‌మ్మెను తాత్కాలికంగా విర‌మించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలకు అనుగుణంగా ఆటో మీటర్‌ ఛార్జీలు పెంచాలని జేఏసీ నేతలు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. 30 ఏళ్ల నుంచి సంక్షేమ బోర్డు కోసం పోరాటాలు, ఉద్యమాలు చేశామని.. ఇదే ఇక చివరి ప్రయత్నమని సంఘాల నాయకులు పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement