Auto Driver | ఆటో డ్రైవర్ మర్యాద బాబు ఆత్మహత్య..
Auto Driver | ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలోని గరిమిళ్లలో ఆదివారం చోటు చేసుకుంది.
Auto Driver | త్రినేత్ర.న్యూస్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలోని గరిమిళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు.
గరిమిళ్లకు చెందిన మర్యాద బాబు(40) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. గత కొంతకాలం నుంచి ఆయనకు ఉపాధి కరువైంది. దీంతో అప్పుల బాధతో తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మార్చి 1వ తేదీన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మర్యాద బాబు మృతి సందర్భంగా ఆటో రిక్షా యూనియన్ల జేఏసీ ప్రెసిడెంట్ మంద రవికుమార్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత ఆటో డ్రైవర్లు పూర్తిగా ఉపాధి కొల్పోయారని తెలిపారు. తమకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మర్యాద బాబు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



