Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
Indefinite Strike | రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌లు సేవలు నిరవధికంగా (Indefinite Strike) నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హాహీలు అమలు చేయాలని, డిమాండ్ల సాధన కోసం ఆటో, యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్‌కు (Auto Bandh) పిలుపునిచ్చింది.
Indefinite Strike | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌లు సేవలు నిరవధికంగా (Indefinite Strike) నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హాహీలు అమలు చేయాలని, డిమాండ్ల సాధన కోసం ఆటో, యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్‌కు (Auto Bandh) పిలుపునిచ్చింది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు మూడు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటి అమలును విస్మరించిందని జేఏసీ నేతలు విమర్శించారు. ప్రధానంగా ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి రూ.12000 ఆర్థిక సాయం (ఏరియర్స్ సహా), గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం కొనసాగింపు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీలను సవరించడంతోపాటు, అక్రమంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిషేధించి.. ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో గత మూడేండ్లలో సుమారు 200 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదన తేవడం సరికాదన్నారు. ఆటో త్రీవీలర్ లైసెన్స్ పునరుద్ధరించాలని, గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని, ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్
- ●Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్

Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు

Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం






