త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Aruna | కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌తో వెంట‌నే రాజీనామా చేయించండి

DK Aruna | గెలుస్త‌మ‌నే న‌మ్మ‌కం ఉంటే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మి భ‌యంతోనే రేవంత్ కోర్టులో పిటిష‌న్ వేయించార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Oct 4, 2026, 3.58 pm IST

DK Aruna | కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌తో వెంట‌నే రాజీనామా చేయించండి
Advertisement
  • సిగ్గు, శ‌రముంటే.. వాళ్లు ఏ పార్టీ ఎమ్మెల్యేలో చెప్పాలి
  • ఖైర‌తాబాద్‌లో ఓట‌మి భ‌యంతోనే కోర్టులో రేవంత్ పిటిష‌న్ వేయించిండు
  • ఇక్క‌డి ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను చీత్క‌రించాలి
  • మీడియా స‌మావేశంలో ఎంపీ డీకే అరుణ

DK Aruna | త్రినేత్ర న్యూస్‌: గెలుస్త‌మ‌నే న‌మ్మ‌కం ఉంటే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మి భ‌యంతోనే రేవంత్ కోర్టులో పిటిష‌న్ వేయించార‌ని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు, శ‌రం ఉంటే వాళ్లు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాల‌న్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌ను ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు చీత్క‌రించాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం నాంప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ రెండు పార్టీలు దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

ఖైర‌తాబాద్ ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కోర్టులో పిటిష‌న్ వేయించిండు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ కూడా దిగ‌జారుడుత‌నానికి పాల్పడ్డాయి. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి మారుతరు. గ‌తంలో బీఆర్ఎస్‌ను విమ‌ర్శించి సిగ్గు లేకుండా అదే పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. డైరెక్ట్‌గా ప్ర‌జ‌ల‌ను అడిగినా చెప్త‌రు వాళ్లు ఏ పార్టీలో ఉన్న‌ర‌ని. దానం నాగేంద‌ర్ విష‌యంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కొంచెమైనా కూడా మీకు ఒక భ‌రోసా ఉంటే, మ‌ళ్లీ గెలుస్త‌మ‌నే న‌మ్మ‌కం ఉంటే అంద‌రి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.

మ‌ళ్లీ పోటీ చేయించండి. మీకు విశ్వాసం ఉంది క‌దా.. మీరు బ్రహ్మాండ‌మైన పాల‌న అందిస్తున్న‌రు. ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు నెర‌వేర్చిండ్రు. ఇవ‌న్నీ చేసిన‌ప్పుడు ఓటు అడిగేందుకు సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌రం మీకేం లేదు. బీఆర్ఎస్‌లో గెలిచి సిగ్గులేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు వెంట‌నే రాజీనామా చేయాలి. సిగ్గు, శ‌రం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? బాజాప్తా బ‌య‌టికొచ్చి చెప్పాలే. మీకు ద‌మ్ము, ధైర్యం ఉంటే చెప్పండి.

గ‌తంలో బీజేపీ ఖైర‌తాబాద్‌లో గెలిచింది. ఈ ఉప ఎన్నిక‌లో మ‌ళ్లీ ఘ‌న విజ‌యం సాధిస్త‌ద‌నే న‌మ్మ‌కం మాకుంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ రెండు పార్టీల‌ను చీత్క‌రించాలి. తెలంగాణ అభివృద్ధికి ప్ర‌ధాని మోదీ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న‌రు. అభివృద్ధిలో తెలంగాణ ముందుండాల‌ని మోదీ స‌హ‌క‌రిస్తున్నారు. ప్ర‌జ‌లంతా రెండు పార్టీల పాల‌న‌ను చూశారు. రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేశారు. ఈరోజు అభివృద్ధి ప‌నుల‌కు నిధులు లేవ‌నే మాట త‌ప్పితే ఇంకేం వినిపిస్త‌లేదు. ఆ రెండు పార్టీలు లోప‌ల ఒక‌టే. వారికి గుణ‌పాఠం చెప్పాలి. ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు బీజేపీని మ‌రోసారి గెలిపించాలి అని డీకే అరుణ కోరారు.

Advertisement
Advertisement