Niranjan Reddy | వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్.. కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం
Niranjan Reddy | కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సాగునీరు లేక నెర్రెలు బారిన నేల.. పచ్చని పైరులతో కళకళలాడింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సాగునీరు లేక నెర్రెలు బారిన నేల.. పచ్చని పైరులతో కళకళలాడింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది.
పదేళ్లలో తెలంగాణ వరి ఉత్పత్తిలో సాధించిన ప్రగతిపై తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వరి ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలవడం.. కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం అని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2014 - 15 నుండి 2024 - 25 కు సంబంధించి విడుదల చేసిన నివేదికనే దానికి సాక్ష్యం అని ఆయన అన్నారు. సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, వంద శాతం పంటల కొనుగోళ్ల మూలంగా ఈ అద్భుత విజయం సాధ్యమైందన్నారు. పంటల ఉత్పత్తులకు అవసరమైన గోదాంలతో పాటు, విద్యుత్ రంగాన్ని పునర్ వ్యవస్థీకరణ చేయడం దీనికి మరో కారణం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
దేశంలోనే అత్యధికంగా 240 శాతం వృద్ధి రేటుకు కారణం పదేళ్ల కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ, రైతు అనుకూల విధానాలే అని తెలిపారు. తెలంగాణ తర్వాత మధ్యప్రదేశ్ 80 శాతం, యూపీ 25 శాతం, తమిళనాడు 20, పంజాబ్ 12 శాతం మాత్రమే వృద్ధి సాధించాయన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ 13 శాతం, మణిపూర్ 25 శాతం, అస్సాం 12 శాతం, కర్ణాటక 11, ఒడిశా 8 శాతం పతనం చెందడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను దేశం అనుసరించాలి అని సూచించారు. రైతులకు, వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని నిరంజన్ రెడ్డి కోరారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



