Planetary Transits | రాశులను మార్చుకోనున్న నాలుగు గ్రహాలు.. ఏ రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..?
Planetary Transits | జ్యోతిషశాస్త్రం ప్రకారం జనవరిలో పలు గ్రహాల సంచారం కారణంగా శుభపద్రంగా, ప్రత్యేకంగా ఉండబోతున్నది. జనవరిలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులను మార్చుకోబోతున్నాయి. వాటి ప్రభావం యావత్ ప్రపంచంతో పాటు 12రాశులవారిపై పడనున్నది.
Planetary Transits | జ్యోతిషశాస్త్రం ప్రకారం జనవరిలో పలు గ్రహాల సంచారం కారణంగా శుభపద్రంగా, ప్రత్యేకంగా ఉండబోతున్నది. జనవరిలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులను మార్చుకోబోతున్నాయి. వాటి ప్రభావం యావత్ ప్రపంచంతో పాటు 12రాశులవారిపై పడనున్నది. ఈ నాలుగు గ్రహాల రాశుల మార్చుకోనున్న నేపథ్యంలో పలు రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను కలిగే అవకాశాలున్నాయి. కొత్త ఏడాదిలో ఏయే గ్రహాలు రాశులను మార్చుకోబోతున్నాయి. రాశులపై వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..!
జనవరిలో సూర్యుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు తమతమ రాశులను మార్చుకోనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా పలురాశుల వారిపై గణనీయ ప్రభావం పడనున్నది. దాంతో పలురాశుల వారికి శుభపద్రంగా ఉండనుండగా.. మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలుంటాయి. జనవరి 13న సుఖ సంతోషాలను ప్రసాదించే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 14న సూర్యుడు సైతం అదే రాశిలోకి వెళ్తాడు. 16న అంగారకుడు, 17న బుధుడు సైతం మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఆయా గ్రహాల సంచారం కారణంగా జనవరిలో కెరీర్, వ్యాపారం, ఆర్థిక అంశాలు, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి.
సుఖాలు, సౌందర్యానికి ప్రతీక అయిన శుక్రుడు మొదట 13న మకర రాశిలోకి వెళ్తాడు. శుక్రుడి సంచారం కారణంగా పలు రాశులవారి భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో సానుకూల మార్పులు ఉంటాయి. కుజుడు (అంగారకుడు) 16 మకర రాశిలోకి వెళ్లనున్నాడు. అంగారకుడు ఒకే రాశిలో దాదాపు 45 రోజులు ఉంటాయి. యుద్ధానికి, పరాక్రమానికి ప్రతీకగా పేర్కొనే మంగళగ్రహం సంచారం కారణంగా కెరీర్, ధైర్యం, ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి. ఈ సమయంలో పలురాశుల వారు పనిచేసే చోట కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ లక్ష్యాలను సాధించే ఛాన్స్ ఉంది.
వాక్చాతుర్యానికి, వ్యాపారానికి, కమ్యూనికేషన్స్‌కు కారకుడైన బుధుడు 17న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. లత్ఫలితంగా పలురాశుల వారు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. నాలుగు గ్రహాల సంచారం కారణంగా 12రాశుల వారిపై కొంత సానుకూల ప్రభావం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మిథునం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి అత్యంత శుభపద్రంగా, సానుకూలంగా ఉంటుంది. అయితే, వృషభం, సింహం, తుల, కుంభరాశుల వారు ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






