iPhone | ఐఫోన్ కొనాలనే కల.. ఆ యువతిని దొంగగా మార్చింది..
ఐఫోన్ (iPhone).. అత్యాధునిక టెక్నాలజీ, సెక్యూరిటీ ఫీచర్స్ దాని సొంతం. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌తో యువతను ఆకర్షిస్తుంది. దానిని జీవితంలో ఒక్కసారైన కొనాలని యువత కలలు కంటూ ఉంటారు. సరిగ్గా ఇలాంటే కోరికే ఓ యువతిని దొంగగా (Thief) మార్చింది.
త్రినేత్ర.న్యూస్: ఐఫోన్ (iPhone).. అత్యాధునిక టెక్నాలజీ, సెక్యూరిటీ ఫీచర్స్ దాని సొంతం. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌తో యువతను ఆకర్షిస్తుంది. దానిని జీవితంలో ఒక్కసారైన కొనాలని యువత కలలు కంటూ ఉంటారు. సరిగ్గా ఇలాంటే కోరికే ఓ యువతిని దొంగగా (Thief) మార్చింది. మొదట ఫోన్ కోసం చేసిన దొంగతనం.. ఆ తర్వాత అలవాటుగా మారింది. దొంగిలించిన సొత్తును తన ప్రియుడితో కలిసి జల్సాలు కోసం ఉపయోగించింది. చివరకు పోలీసులకు పట్టుబడటంతో దొగతనం చేసి కొనుగోలుచేసిన ఐఫోన్ పోయింది.. కటకటాలపాలైంది.
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కేరాడిహ్-రాయినిదండ్‌కు చెందిన ఓ సుష్మ నికుంజ్ అనే మహిళ తన ఇంట్లో సుమారు రూ.15 లక్షల నగదు, బంగారు బిస్కెట్లు, విలువైన ఆభరణాలతో కూడిన సూట్‌కేసు మాయమైందని గత నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె మేనకోడలు మినాల్ నికుంజ్‌పై అనుమానం కలిగింది. దీంతో ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆ యువతి చేసిన పని తెలిసి విస్తు పోయారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..ఐఫోన్ కొనాలనే కలను సాకారం చేసుకునేందుకు తన అత్త సుష్మ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించింది.
మొదట రూ.2 లక్షలు దొంగతనం చేశానని, ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నానని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో రూ.3 లక్షలు ఎత్తుకెల్లినట్లు చెప్పింది. ఈజీ మనీకి అలవాటు మనసు కదా.. ఊరికే ఉంటుందా.. క్రమంగా సుష్మ ఇంట్లో నుంచి డబ్బు, బంగారం, నగలు దొంగిలించింది. ఆ తర్వాత తన ప్రియుడితో అనిల్ ప్రధాన్‌తో కలిసి రాయ్‌పూర్, బిలాయ్ వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి మూడు రోజులు గడిపారు. సుమారు రూ.5 లక్షలు వెచ్చించి లగ్జరీ హోటళ్లలో ఖరీదైన మద్యంతో జల్సా చేశారు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒడిశాలోని రూర్కీ వెళ్లి.. బంగారం అమ్మేశారు. వచ్చిన డబ్బుతో హారియర్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశారు. ఇలా కొట్టేసిన డబ్బుతో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుండగా దొంగతనం కేసు నమోదవడం, వారిని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.86,300 నగదు, హారియర్ కారు, బంగారు బ్రేస్‌లెట్, బంగారు బిస్కెట్లు, మంగళసూత్రం, ఐఫోన్, 4 ఆండ్రాయిడ్ ఫోన్లు, నగలు, ఇతర విలువైన వస్తువులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.51 లక్షల 82 వేల 300 ఉంటుందని తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






