Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు
Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్లిన ఓ మహిళను వైద్యుడు నిలువునా మోసం చేశాడు. గర్భసంచి ఆపరేషన్‌తో పాటు ఆమె కిడ్నీని కూడా తొలగించాడు.
Arpitha Nursing Home | త్రినేత్ర.న్యూస్ : గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్లిన ఓ మహిళను వైద్యుడు నిలువునా మోసం చేశాడు. గర్భసంచి ఆపరేషన్‌తో పాటు ఆమె కిడ్నీని కూడా తొలగించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెలుగు చూసింది.
యాదగిరిగుట్టకు చెందిన కమలమ్మ అనే మహిళ గత కొంతకాలంగా గర్భాశయ సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో జులై 13న ఆలేరులోని అర్పిత నర్సింగ్ హోమ్‌ను ఆశ్రయించారు. గర్భాశయంలో కణితి ఉందని, దాన్ని తొలగించాలని వైద్యుడు ప్రభాకర్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకు రూ. లక్షా 50 వేలు ఖర్చు అవుతుందని చెప్తే.. తాము రూ. లక్షా 30 వేలు చెల్లిస్తామని చెప్పి, ఆ డబ్బు కూడా చెల్లించామని చెప్పారు. దీంతో శస్త్ర చికిత్స నిర్వహించి మూడు బాక్సులు ఇచ్చారు.. అందులో కణితులు ఉన్నట్లు చెప్పారు. వీటిని బయాప్సి నిమిత్తం ల్యాబ్‌కు పంపగా, అందులో ఒకటి కిడ్నీ ఉందని తేలింది. కిడ్నీని ఎందుకు తొలగించారనే ల్యాబ్ సిబ్బంది మమ్మల్ని ప్రశ్నించగా, మేం డాక్టర్‌ను నిలదీయగా, పొరపాటున కిడ్నీని తొలగించినట్లు ఒప్పుకున్నాడు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
- ●Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...
- ●Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్

Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...

Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి






