త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | యాద‌గిరిగుట్ట ఆల‌య హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుక‌లు

Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌య హుండీ లెక్కింపు గురువారం పూర్త‌యింది. 49 రోజులకు గానూ హుండీ న‌గ‌దు ఆదాయం రూ. 3,52,47,662 అని ఆల‌య అధికారులు తేల్చారు.

S

Telangana | Published On Aug 20, 2026, 6.20 pm IST

Yadagirigutta | యాద‌గిరిగుట్ట ఆల‌య హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుక‌లు
Advertisement

Yadagirigutta | త్రినేత్ర‌.న్యూస్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌య హుండీ లెక్కింపు గురువారం పూర్త‌యింది. 49 రోజులకు గానూ హుండీ న‌గ‌దు ఆదాయం రూ. 3,52,47,662 అని ఆల‌య అధికారులు తేల్చారు. 114 గ్రాముల బంగారం, 3 కిలోల 900 గ్రాముల వెండిని భ‌క్తులు స్వామి వారికి విరాళంగా ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ రూపంలోనూ భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు.

విదేశీ కానుక‌ల వివ‌రాలివే..

అమెరికా – 2,047 డాలర్లు
ఇంగ్లాండ్ – 190 పౌండ్లు
కెనడా – 85 డాలర్లు
దిర్హామ్స్ – 565
నేపాల్ – 180
ఆస్ట్రేలియా – 110
వియత్నాం – 1,000
మలేషియా – 53
సింగపూర్ – 16
సౌదీ అరేబియా – 116
ఖతార్ – 2
న్యూజిలాండ్ – 5
యూరో – 30
దక్షిణాఫ్రికా – 100
కెన్యా – 100

Advertisement
Advertisement