త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న కాకా – ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన మెగాస్టార్‌

చిరంజీవి కాకా మూవీ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. షూటింగ్ డిలే వ‌ల్ల పండుగకు విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వేస‌వికి వాయిదాప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌ను మేక‌ర్స్ కొట్టిప‌డేశారు. కాకా సంక్రాంతికే థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేద‌ని వెల్లడించారు.

N

Entertainment | Published On Sep 4, 2026, 5.48 pm IST

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న కాకా  – ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన మెగాస్టార్‌
Advertisement

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న కాకా మూవీ రిలీజ్ డేట్ మారిన‌ట్లు సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే వ‌ల్ల వాయిదాప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పండుగ బ‌రి నుంచి త‌ప్పుకున్న ఈ మూవీ వేస‌విలోకి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌పై కాకా టీమ్ రియాక్ట్ అయ్యారు. సంక్రాంతికే కాకా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేద‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 13న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు  వెల్లడించారు.

షూటింగ్ అప్‌డేట్‌...

కాకా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా మేక‌ర్స్ రివీల్ చేశారు. సెప్టెంబ‌ర్ ఏడవ తేదీ నుంచి హైద‌రాబాద్‌లో ఓ కీల‌క షెడ్యూల్ మొద‌లుకాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో చిరంజీవి, అన‌స్వ‌ర రాజ‌న్, నివేథా థామ‌స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌...

శుక్ర‌వారం మేక‌ర్స్ కాకా సినిమా నుంచి వ‌ర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవితో ఓ సీన్ గురించి సీరియ‌స్‌గా డిస్క‌స్ చేస్తూ డైరెక్ట‌ర్ బాబీ క‌నిపిస్తున్నారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని మేక‌ర్స్ అన్నారు. ఈ గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్పారు.

డ్యూయ‌ల్ రోల్‌...

కాకా మూవీలో చిరంజీవి డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఓ రోల్ క్లాస్‌గా ఉండ‌గా...మ‌రో రోల్ మాస్ కోణంలో సాగుతుంద‌ని అంటున్నారు. కాకా మూవీకి థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

జ‌న‌నాయ‌గ‌న్ నిర్మాత‌...

జ‌న‌నాయ‌గ‌న్‌, టాక్సిక్ వంటి సినిమాల‌ను నిర్మించిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కాకాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. భారీ బ‌డ్జెట్‌తో వెంక‌ట్ కే నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాల్తేర్ వీర‌య్య త‌ర్వాత చిరంజీవి, బాబీ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది.

 

Advertisement
Advertisement