Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
Uttam Kumar Reddy | కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలతో నీటిపారుదల శాఖలో మంచి ఫలితాలు చూశామని.. ఆ అనుభవంతోనే ఎస్ఎల్‌బీసీ, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు ఆర్మీ ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
- ఎస్ఎల్బీసీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరిస్తాం
- జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ పూర్తి చేస్తాం
- ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ భేటీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలతో నీటిపారుదల శాఖలో మంచి ఫలితాలు చూశామని.. ఆ అనుభవంతోనే ఎస్ఎల్‌బీసీ, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు ఆర్మీ ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆర్మీ ఇంజినీర్ల రాకతో పనుల్లో నాణ్యత, వేగం, భద్రత మరింత పెరుగుతాయ్నారు. న్యూఢిల్లీలో మంగళవారం ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. ఆర్మీ ఇంజినీర్ల ప్రతిపాదనపై ఆర్మీ చీఫ్ అంగీకరించారని తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు ఆర్మీ ఇంజినీర్ల సేవలు అవసరం. ముగ్గురు ఆర్మీ అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు ఆర్మీ ప్రధాన కార్యాలయం ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను పంపింది. ఒక ఆర్మీ అధికారిని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనుల పర్యవేక్షణకు నియమించే ప్రయత్నం చేస్తున్నాం. మరో ఇద్దరు అధికారులను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు నియమించాలని నిర్ణయించాం.
ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్నాం..
ఆర్మీ ఇంజినీర్ల రాకతో పనుల్లో నాణ్యత, వేగం, భద్రత మరింత పెరుగుతాయి. ఆర్మీ అధికారుల సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణను కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఉపయోగించుకుంటాం. లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, రంజిత్ ఏ.మీనన్, హెచ్.వి. భల్లా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు ఆర్మీ అధికారుల అనుభవం వినియోగంచుకుంటాం.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి రెండు వైపులా జరుగుతున్న తవ్వకాలను ఆర్మీ అధికారి పర్యవేక్షిస్తారు. సొరంగం లోపలి పనులు, వెంటిలేషన్, భద్రతా ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. 44 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఇప్పటికే దాదాపు 35 కిలోమీటర్ల పని పూర్తి అయింది. 2028, జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరిస్తాం. మూడు బ్యారేజీల మట్టి, కాంక్రీట్, పునాదుల పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఐఐటీ బాంబే, ఏఎఫ్‌ఆర్‌వై ఇండియా నిపుణులు పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తున్నారు. బ్యారేజీల పునరుద్ధరణకు నిపుణుల బృందాలు తుది డిజైన్లు సిద్ధం చేస్తున్నాయి. ఆర్మీ అధికారుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయి సమన్వయం, జవాబుదారీతనం మరింత బలోపేతం కానుంది. పనుల వేగం కోసం భద్రత, నాణ్యత, ఇంజినీరింగ్ ప్రమాణాల విషయంలో రాజీపడబోం. ఎస్‌ఎల్‌బీసీని గడువులోగా పూర్తి చేసి మూడు బ్యారేజీలను పూర్తి భద్రతతో వినియోగంలోకి తీసుకొస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Raashii Khanna | ధర్మన్ అప్డేట్ లీక్ చేసిన రాశీఖన్నా - మూవీ టీమ్ వార్నింగ్‌తో పోస్ట్ డిలీట్
- ●Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..
- ●Bullet Train Steel Bridge Maharashtra | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో చారిత్రక ఘట్టం: మహారాష్ట్రలో తొలి స్టీల్ బ్రిడ్జ్.. 1300 కి.మీ ప్రయాణించి వచ్చిన భారీ వంతెన
- ●Konda Surekha | మీకు మొగోళ్లవసరంలే.. ఆడోళ్లతోనే చిత్తు చిత్తు కొట్టిస్తా
- ●Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?
- ●Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?

Raashii Khanna | ధర్మన్ అప్డేట్ లీక్ చేసిన రాశీఖన్నా - మూవీ టీమ్ వార్నింగ్‌తో పోస్ట్ డిలీట్

Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..

Bullet Train Steel Bridge Maharashtra | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో చారిత్రక ఘట్టం: మహారాష్ట్రలో తొలి స్టీల్ బ్రిడ్జ్.. 1300 కి.మీ ప్రయాణించి వచ్చిన భారీ వంతెన

Konda Surekha | మీకు మొగోళ్లవసరంలే.. ఆడోళ్లతోనే చిత్తు చిత్తు కొట్టిస్తా






