Open letter to CM Revanth | 23,000 బడులను మూసేస్తారా? దయచేసి వద్దు
Open letter to CM Revanth | రాష్ట్రంలో బడుల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విద్యావేత్తలు, మేధావులు, పౌరులు విజ్ఞప్తి చేశారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని చేసిన ప్రకటనను పునఃసమీక్షించాలని కోరారు. 23,000 బడుల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు.
- ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి
- విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడి అని మేనిఫెస్టోలో చెప్పారు
- కానీ కేటాయింపులు 8.2% దాటలే
- సీఎం రేవంత్‌కు విద్యావేత్తలు, మేధావులు, పౌరుల బహిరంగ లేఖ
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో బడుల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విద్యావేత్తలు, మేధావులు, పౌరులు విజ్ఞప్తి చేశారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని చేసిన ప్రకటనను పునఃసమీక్షించాలని కోరారు. 23,000 బడుల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు. గత జూన్ 6న బెంగళూరులో "ది హిందూ" పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఇవీ ఆ లేఖ వివరాలు
1. రాజ్యాంగ నిబంధనలు విద్యాహక్కు చట్టం (RTE) ఉల్లంఘన
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A , విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత, విద్యను పొందడం బాలల హక్కు. మీ ప్రకటన అమలులోకి వస్తే, రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయితీలలో దాదాపు 8,769 గ్రామాలలో ప్రభుత్వ బడులు శాశ్వతంగా మూతపడతాయి. ఈ మూసివేసే జాబితాలో వందలాది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు కూడా వేల సంఖ్యలో ఉంటాయి. నివాస ప్రాంతానికి సమీపంలో పాఠశాలలు లేకపోతే రవాణా, భద్రతా కారణాల వల్ల దళిత, ఆదివాసి, బీద బడుగు వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి (Dropouts) విద్యకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. డ్రాప్ అవుట్ అయిన వాళ్లు కొంతమంది దగ్గర ఉన్న ప్రైవేటు విద్యకు వెళ్తే మరి కొంతమంది బాల కార్మికులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనది. దేశ చరిత్రలోనే అత్యంత తిరోగమన, ప్రజా వ్యతిరేక చర్యగా మిగిలిపోతుంది.
2. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాగ్దానాల ఉల్లంఘన
“విద్యపై పెట్టే ఖర్చు.. ఖర్చు కాదు, అది భవిష్యత్తుపై పెట్టుబడి" అని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంటూ, బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేశారు. కానీ ప్రస్తుత కేటాయింపులు 8.2% దాటలేదు. జాతీయ సగటు 15% ఉండగా, తెలంగాణ వెనుకబడి ఉండటం శోచనీయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన దాదాపు 6,000 పాఠశాలలను మెరుగైన సదుపాయాలతో తిరిగి పునఃప్రారంభిస్తామని మీ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా ఏకంగా 23,000 పాఠశాలలను మూసివేయాలని తలపెట్టడం అత్యంత విషాదకరం.
3. 34% మంది పిల్లలే..
రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేటు రంగానికి అడ్డూ అదుపు లేకుండా అనుమతులు ఇవ్వడం, వారిపై ఎటువంటి నియంత్రణలు లేకపోవడం వల్ల విద్యా వ్యాపారీకరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 34% మంది పిల్లలు మాత్రమే మిగిలారనే వాస్తవం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక “జయశంకర్ బడిబాట” కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికార యంత్రాంగం సీరియస్‌గా, ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం వల్ల అది మొక్కుబడి కార్యక్రమంగా తయారయ్యింది. అందువలన ప్రభుత్వ బడులలో చేరికలు తగ్గి, 'జీరో ఎన్రోల్మెంట్' బడులు పుట్టుకొస్తున్నాయి.
అసలు పాఠశాలల్లో చదువు సరిగ్గా సాగుతుందో లేదో చూసే అధికారులే లేరు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 25 జిల్లాల్లో రెగ్యులర్ డీఈవో (DEO)లు లేరు. 633 మండలాలకు గాను 612 మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు (MEO) లేరు. పర్యవేక్షించే అధికారులే లేనప్పుడు విద్యా ప్రమాణాలు పడిపోవడంలో ఆశ్చర్యం లేదు. విద్యా ప్రమాణాలను తెలిపే 'పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్' ప్రకారం దక్షిణాది రాష్ట్రాలలోనే తెలంగాణ అత్యంత వెనుకబడి ఉంది.
4. విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై సమగ్ర అధ్యయనం..
జీరో ఎన్రోల్మెంట్ బడులు ఏర్పడటానికి గల అసలు కారణాలపై (మౌలిక వసతుల, ఉపాధ్యాయుల కొరత, విచ్చలవిడిగా ప్రైవేట్ బడుల అనుమతులు, పర్యవేక్షణ లోపం) క్షేత్రస్థాయిలో లోతైన, సమగ్రమైన అధ్యయనం చేయకుండా నేరుగా బడులను మూసివేయాలనుకోవడం సరైంది కాదు.
తక్షణమే చేపట్టాల్సిన చర్యలు..
1. బడుల మూసివేత ప్రకటనను ఉపసంహరించుకోవాలి
2. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలి. మీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా ప్రతి చిన్న గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలి
3. అన్ని బడులలో అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, డిజిటల్ వనరులు సమకూర్చాలి
4. ఖాళీగా ఉన్న అన్ని బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దు
5. ప్రైవేటు పాఠశాలలను పకడ్బందీగా నియంత్రించేందుకు జీవో నెంబర్ 1ను అమలు పకడ్బందీగా అమలు చేయాలి
- ఇట్లు విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం తెలంగాణ
1. Justice B. Chandra Kumar, Formar Judge, High Court AP
2. Justice Rajani, Formar Judge, High Court TG
3. Justice Radharani, Formar Judge, High Court TG
4. Justice Nimma Narayana, Formar Judge, High Court AP
5. Prof. V.S.Prasad, Former Director, NAAC
6. Prof. Shantha Sinha, Former Chairperson, NCRPC
7. K.Ramachandra Murthy, Former Chief Editor. Sakshi Media Group.
8. Prof. D.Narsimha Reddy, Former Dean, School of Social Science, HCU
9. Prof. Madabhushi Sreedhar, Former Commissioner,CIC
10. Prof. M.Kodandaram, MLC
11. Deshapathi Srinivas, Poet & MLC
12. Goreti Venkanna, Poet & MLC
13. Prof. K.Nageshwar, Former MLC
14. Prof. Limbadri, Former Chairperson Council of Higher Education
15. Prof. N.Gopi, VC TU
16. Prof. S.Rama Chandram, Former VC, OU
17. Prof. Kashim, Principal of Arts College, OU
18. Dr.Mohan Rao, Former Director, CCMB
19. Dr.K.Babu Rao, Scientist & Activist
20. K.Srinivasa Reddy, Journalist, Chairman, Press Academy
21. K.Srinivas, Former Editor, Andhra Jyothi
22. Allam Narayana, Former Chair Person Press Academy
23. Devulapalli Amar, Former Chair Person AP Press Academy
24. N.Venugopal, Journalist & Editor, Veekshanam Magazine
24. Ramesh, Editor, Navatelangana
25. Dr.Parakala Prabhakar, Political Analyst
26. Prof. Kathyayani Vidmahe, KU, Kendra Shithya Academy Awardee
27. Dr.Nandini Sidha Reddy, Poet, Kendra Sahithya Academy Awardee
28. Bhupal, Writer, Kendra Shithya Academy Awardee
29. Nalimela Bhaskar, Writer, Kendra Shithya Academy Awardee
30. Ranganayakamma, Marxist Writer and Critique
31. Mercy Margaret, Poet, Kendra Shithya Academy Awardee
32. B.Sajaya, Activists
33. Prof. Jayadheer Thirumala Rao, Reknowned Historien
34. Dr.Pasunuri Ravinder, Kendra Shithya Academy Awardee
35. Jupaka Subhadra, Dalith activist, Poet and Writer
36. Dr. Naleshwaram Shankaram, Writer
37. Varala Anand, Journalist & Film Critic
38. B.Vimalakka, Arunodaya Cultural Forum
39. Pasham Yadagiri, Activist
40. Jayaraj, Reknowned Poet and Singer
41. Mallepalli Laxmaiah, Writer
42. Sangishetty Srinivas, Writer
43. Prof. Rama Melkote, OU
44. Prof. T.Jyothi Rani, KU
45. Prof. Harjinder Singh, IIIT Hyderabad
46. Prof. K.Y.Rathnam, HCU
47. Prof. Anupama, HCU
48. Prof. S.Maqbool Ahmed, MANU
49. Prof. Ramkishore, NIT, Warangal
50. Prof. Lakavath Ramsingh, Veterinary University, Hyderabad
51. Prof. J.Laxman, OU
52. Prof. A.Vinaybabu,JNTU
53. Prof. A.Vinayak Reddy, KU
54. Prof. R.Vijay, HCU
55. Prof. K.Sreenivasulu, OU
56. Prof. G.Vijay, HCU
57. Prof. Anwar Khan
58. Prof. Kalpana Kannabhiran
59. Prof. N.Balaramulu, OU
60. Prof. Sudarshan, HCU
61. Prof. Bhavani, HCU
62. Prof. Laxmi, OU
63. Prof. Venkatadasu, OU
64. Prof. Moinuddin, OU
65. Prof. K.Murali Manohar, KU
66. Prof. Hamid Mohd Khan, OU
67. Prof. G.Anuradha, OU
68. Thulasi Chandu, Journalist
69. C.Vanaja, Journalist
70. Sd.Rafee, Film Producer
71. Khaleeda Parveen, Woman Activist
72. Dr.M.F.Gopinath, Activist
73. Meera Sanghamithra, NAPM Activist
74. R.Venkat Reddy, NVF
75. Ambati Nagaiah, President TVV
76. Dr.Jilukara Srinivas, Activist
77. Chikkudu Prabhakar, High Court Advocate
78. Nandigam Krishna Rao, High Court Advocate
79. V.Raghunath, High Court Advocate
80. Kanneganti Ravi, Activist
81. Vissa Kiran, Activist
82. Dr.Thipparthi Yadaiah, Activist
83. T.Ramesh, Founder Vignana Darshini
84. Dr.S.Prudhvi Yadav, Activist
85. Rehman, Journalist
86. M.Thimmareddy, Indipendent Researcher
87. Prof. M.Shankar Narayana, KU
88. Prof. Surepalli Sujatha, Principal Arts College, SU]
89. Prof. Konda Nageshwar, OU
90. Prof. Shiva Reddy, OU
91. Prof. Purendra Prasad, HCU
92. Prof. Sathyanarayana, EFLU
93. Prof. Ramulu, HCU
94. Prof. Radha Krishna, KU
95. Prof. Sadanadam, KU
96. Prof. Venkateshwarlu, CESS
97. Dr. B.Nageshwar Rao
98. Dr. Bairi Naresh, Indian Atheist Association
99. Dr.Mettu Ravinder, Writer
100. Chava Ravi, President, UTF
101. Sadananda Goud, President, STU
102. Ch. Anil Kumar, President TPTF
103. M.Somaiah, President DTF
104. A.Narsimhareddy, Former President APTF
105. M.Gangadhar, AIFRTE
106. Prof. Chakradhar Rao, AIFRTE
107. Prof.G.Haragopal, AIFRTE
108. T.Linga Reddy, General Secretary DTF
109. Nanneboina Thirupathi, General Secretary TPTF
110. Y.Ashok Kumar, Associate President TSEC
111. M.Raghu Shankar Reddy, Addl. Gen.Sec. TSEC
112. M.N.Kistappa, Vice President TSEC
113. K.Venugopal, Vice President TSEC
114. K.Ravi Chandra, Secretary TSEC
115. K.Subbarao, TRIETA
116. Raghavachary, PAV
117. Adama Srinivas Reddy, SCIE
118. Mahesh, PDSU
119. Putta Laxman, AISF
120. Anil Kumar, PDSU
121. A.Vijay, PDSU (V)
122. Ramakrishna, PYL
123. Laxminarayana, PYL
124. Syed Valli Khadri, AIYF
125. Prof.K.Laxminarayana, Organizing Secretary TSEC
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత : మంత్రి తుమ్మల
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ షాక్, రూ.2 లక్షల కోట్లు ఆవిరి..
- ●Etala Rajendar | మోదీ చేసినట్టు 10 శాతం చేసినా కచ్చితంగా గెలుస్తం
- ●Nizamabad | భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య
- ●FIFA 2026 | ప్రపంచకప్‌లో అమెరికా ఓటమి.. ముదిరిన వివాదం
- ●Emmanuel Macron | హోటల్ వద్ద వరుస పేలుళ్లు.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు

Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత : మంత్రి తుమ్మల

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ షాక్, రూ.2 లక్షల కోట్లు ఆవిరి..

Etala Rajendar | మోదీ చేసినట్టు 10 శాతం చేసినా కచ్చితంగా గెలుస్తం

Nizamabad | భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య




