త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koppula Eshwar | రైతుల‌ను క్రిమిన‌ల్స్‌లా చూస్తారా.. వెంట‌నే కేసులు ఎత్తేయండి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar | వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌ను కాంగ్రెస్ స‌ర్కార్ క్రిమిన‌ల్స్‌లా చూస్తోంద‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 8, 2026, 5.40 pm IST

Koppula Eshwar | రైతుల‌ను క్రిమిన‌ల్స్‌లా చూస్తారా.. వెంట‌నే కేసులు ఎత్తేయండి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Advertisement

త్రినేత్ర న్యూస్‌: వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌ను కాంగ్రెస్ స‌ర్కార్ క్రిమిన‌ల్స్‌లా చూస్తోంద‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మండిప‌డ్డారు. రైతుల పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాల్సింది పోయి, వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై నమోదైన కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేర‌కు గురువారం ఆయ‌న మాట్లాడారు.

వనపర్తి జిల్లాలో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత దారుణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అన్నదాతల చేతులకు బేడీలు వేయడం, అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. ఎంతో కష్టపడి పెంచుకున్న పంటలు కళ్ళముందే ఎండిపోతుంటే తట్టుకోలేక నీటి కోసం నిరసన తెలిపిన రైతులను క్రిమినల్స్‌లా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని కొప్పుల ఫైర్ అయ్యారు.

Advertisement
Advertisement