TGS RTC | ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం..
TGS RTC | మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో (TGS RTC) ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా బస్సులను సమకూర్చుకుంటున్నది. అధిక పనిభారంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
TGS RTC | త్రినేత్ర.న్యూస్: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో (TGS RTC) ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా బస్సులను సమకూర్చుకుంటున్నది. అధిక పనిభారంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిపై కొంతవరకైనా పని ఒత్తిడి తగ్గించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల చదువుపూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు.. తమకు అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అవసరమైన నిర్ధిష్ట నైపుణ్యాలు లేకపోవడంఓ ఉపాధి అవకాశాలు కోల్పోతున్న వారికోసం అప్రెంటిస్‌షిప్ (Aprentiship) చేసేందుకు అవకాశం కల్పించనుంది. ఇంజినీరింగ్, నాన్ఇంజినీరింగ్ అభ్యర్థులకు జాతీయ అప్రెంటిస్ పథకం ద్వారా శిక్షణ ఇస్తున్నది. మూడేండ్లపాటు సాగే ఈ శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫెండ్ ఇవ్వనుంది.
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 11 డిపోల్లో వీరికి శిక్షణ అవకాశాలు కల్పించింది. ఇక్కడ ప్రతి దానిలో ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లు పని చేస్తున్నారు. వారు మెకానికల్, ట్రాఫిక్ విభాగాలను పర్యవేక్షిస్తారు. మేనేజర్లకు సహాయం చేయడానికి అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులు తోడైతే మెకానికల్, ట్రాఫిక్ విభాగాల నిర్వహణ సులభం కానుంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడం సాధ్యమవుతుందని సంస్థ భావిస్తున్నది.
అప్రెంటిస్‌షిప్ అవకాశం ఎవరికి..
ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్), బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసినవారు. 2020-21 ఏడాదిలో లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్టైఫెండ్..
ఎంపికైనవారికి ఇంజినీరింగ్ అభ్యర్థులైతే మొదటి ఏడాది ప్రతి నెల రూ.18 వేలు, రెండో సంవత్సరంలో రూ.20 వేలు, మూడో సంవత్సరం రూ.22 వేలు ఇస్తారు. నాన్-ఇంజినీరింగ్ అభ్యర్థులకు రూ.16 వేలు, రూ.17,500, రూ.19 వేలు చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
ఎప్పటిలోపు: ఏప్రిల్ 15 లోగా
వెబ్‌సైట్: https://nats.education.gov.in
తాజావార్తలు
- ●Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
- ●Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..
- ●RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన
- ●Late Devonian | 370 మిలియన్ ఏళ్ల నాటి విపత్తు రహస్యం వీడింది..!
- ●Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం

Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన






