త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BDL | ఐటీఐ అర్హ‌త‌తో.. బీడీఎల్‌లో 134 అప్రెంటిస్‌లు

BDL | రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న కంపెనీ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సంగారెడ్డి జిల్లాలోని భానూర్ యూనిట్‌లో 2026-27 ఏడాదికిగాను అప్రెంటిస్‌షిప్ (Apprenticeship) శిక్షణ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

Telangana | Published On Nov 24, 2026, 9.29 am IST

BDL | ఐటీఐ అర్హ‌త‌తో.. బీడీఎల్‌లో 134 అప్రెంటిస్‌లు
Advertisement

BDL | త్రినేత్ర న్యూస్‌: రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న కంపెనీ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సంగారెడ్డి జిల్లాలోని భానూర్ యూనిట్‌లో 2026-27 ఏడాదికిగాను అప్రెంటిస్‌షిప్ (Apprenticeship) శిక్షణ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 134 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, మెషినిస్ట్‌, ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ట‌ర్న‌ర్ వంటి ట్రేడ్‌ల‌లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఐటీఐ (ITI) ఉత్తీర్ణులైన అభ్యర్థులు న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు: 134
ఫిట్టర్- 35
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 30
మెషినిస్ట్ (సీ)- 9
మెషినిస్ట్ (జీ)- 3
వెల్డర్- 6
మెకానిక్ డీజిల్- 4
ఎలక్ట్రీషియన్- 11
టర్నర్- 8
కోపా- 22
ప్లంబర్- 1
మెకానిక్- 1
కెమికల్ ల్యాబ్- 3
ఎంఎంవీ- 1

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (SSC), సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అభ్యర్థులు 14 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుల‌కు చివరి తేదీ: న‌వంబ‌ర్ 30
వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.gov.in

పూర్తి వివ‌రాల‌కు..

Advertisement
Advertisement