UCO Bank | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు
UCO Bank | కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న యూకో బ్యాంక్ (UCO Bank) 2026-27 సంవత్సరానికిగాను అప్రెంటిస్ల (Apprentice) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 530 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానించింది.
UCO Bank | త్రినేత్ర న్యూస్: కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న యూకో బ్యాంక్ (UCO Bank) 2026-27 సంవత్సరానికిగాను అప్రెంటిస్ల (Apprentice) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 530 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్లో 8 ఖాళీలున్నాయి. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞానం ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రతినెల నెల రూ.16,650 అందిస్తారు. శిక్షణ ఏడాదిపాటు ఉంటుంది. ఆన్లైన్ రాతపరీక్షను నవంబర్ 7న నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు: 530
తెలంగాణ- 8 (జనరల్ 5, ఎస్సీ 1, ఓబీసీ 2)
ఆంధ్రప్రదేశ్- 8 (జనరల్ 5, ఎస్సీ 1, ఓబీసీ 2)
పశ్చిమ బెంగాల్- 86
ఉత్తరప్రదేశ్- 45
ఒడిశా- 41
రాజస్థాన్- 37
బిహార్- 34
మహారాష్ట్ర- 32
మధ్యప్రదేశ్- 27
హిమాచల్ప్రదేశ్- 25
అస్సాం- 24
పంజాబ్- 24
తమిళనాడు- 21
గుజరాత్- 20
అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ రాతపరీక్షను BFSI SSC నిర్వహిస్తుంది. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తి చేయాలి.
జనరల్, ఫైనాన్స్ అవేర్నెస్- 25
ఇంగ్లిష్, హిందీ భాష- 25
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 25
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు మొదట ఎన్ఏటీఎస్ పోర్టల్ లో(NATS Portal) https://nats.education.gov.in రిజిస్టర్ కావాలి. తరువాత యూకో బ్యాంక్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.800+జీఎస్టీ, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200+జీఎస్టీ
దరఖాస్తు ముగింపు తేదీ: అక్టోబర్ 29
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబర్ 29
ఆన్లైన్ పరీక్ష: అక్టోబర్ 7
వెబ్సైట్: www.uco.bank.in
సంబంధిత వార్తలు

Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే
అక్టోబర్ 15, 2026

Telangana El Nino Crisis | ఏమీ చేయలేం.. ఎల్ నినోపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
అక్టోబర్ 15, 2026

Ponguleti Srinivas Reddy | వరంగల్ హాస్పిటల్లో దసరా నుంచి సాఫ్ట్ లాంచ్ ఓపీ సేవలు: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 16 రాశిఫలాలు.. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది!
- ●ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి
- ●Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
- ●Poonam Bajwa | స్విమ్మింగ్పూల్లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ
- ●Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
- ●Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే

Horoscope | అక్టోబర్ 16 రాశిఫలాలు.. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది!

ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్

Poonam Bajwa | స్విమ్మింగ్పూల్లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ



