త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIC HFL Apprentice | ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 232 అప్రెంటిస్‌లు

LIC HFL Apprentice | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో అప్రెంటిస్ (Apprenticeship) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 232 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ (LIC HFL Apprentice) విడుద‌ల చేసింది.

G

National | Published On Oct 23, 2026, 6.25 am IST

LIC HFL Apprentice | ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 232 అప్రెంటిస్‌లు
Advertisement

LIC HFL Apprentice | త్రినేత్ర న్యూస్‌: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో అప్రెంటిస్ (Apprenticeship) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 232 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ (LIC HFL Apprentice) విడుద‌ల చేసింది. ఈ ఖాళీలు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ముంబై, పుణె, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ, కోల్‌క‌తాలో ఉన్నాయి. అర్హత క‌లిగిన‌వారు నవంబర్‌ 1 వరకు nats.education.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. శిక్ష‌ణ ఏడాదిపాటు ఉంటుంది.

అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 232

అర్హత: యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్ల నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 2026 అక్టోబర్‌ 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత‌ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ప్ర‌తినెల రూ.14,150. నుంచి రూ.16,650 వ‌ర‌కు స్టైపెండ్ చెల్లిస్తారు.

ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష 100 ప్ర‌శ్న‌లు, 100 మార్కుల‌కు ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. జ‌న‌ర‌ల్, ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్ 25 ప్ర‌శ్న‌లు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 25 ప్ర‌శ్న‌లు, రీజ‌నింగ్ ఎబిలిటీ, కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్ 25 ప్ర‌శ్న‌లు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్ర‌శ్న‌ల చొప్పున అడుగుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: పురుష అభ్యర్థులకు రూ.800, మహిళా, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 1
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష: నవంబర్ 7
డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ తేదీ: న‌వంబ‌ర్ 15
వెబ్‌సైట్‌: https://nats.education.gov.in/

Advertisement
Advertisement