త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Degree | డిగ్రీ పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

OU Degree | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

A

Telangana | Published On Jan 29, 2026, 8.59 pm IST

OU Degree | డిగ్రీ పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Advertisement

OU Degree | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మూడు, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. విద్యార్ధులు తమ మార్కు మెమోలను మూడు వారాల తరువాత నుంచి సంబంధిత కళాశాలల్లో తీసుకోవాలని సూచించారు. ఈ కోర్సుల పరీక్షా ఫలితాలపై రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 6వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ. వెయ్యి చొప్పున చెల్లించి వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.

Advertisement
Advertisement