Job Mela | 24న ఓయూలో జాబ్ మేళా.. వివరాలివే..!
Job Mela | మీరు ఫార్మసీ కోర్సు( Pharmacy Course ) పూర్తి చేశారా..? లేదా ఏదైనా డిగ్రీ( Degree ) పూర్తి చేశారా..? అయితే మీ కోసమే ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University )లో జాబ్ మేళా( Job Mela ) నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న ఓయూలో అపోలో ఫార్మసీ( Apollo Pharmacy ) జాబ్ మేళా నిర్వహించేందుకు సిద్ధమైంది. వివరాలివే..!
Job Mela | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగ యువతీయువకులకు శుభవార్త. ఈ నెల 24వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University )లో జాబ్ మేళా ( Job Mela )నిర్వహించనున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి రాము అధికారికంగా ప్రకటించారు. జూలై 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది.
జాబ్‌లు ఎక్కడంటే..?
హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న అపోలో ఫార్మసీ( Apollo Pharmacy )లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
అర్హులు ఎవరు..?
డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వారు అర్హులు. లేదా ఇతర డిగ్రీలు ఉన్న వారు కూడా జాబ్ మేళాకు హాజరు కావొచ్చు.
ఉద్యోగాలివే..!
ఫార్మసిస్ట్(డీ /బీ/ ఎం ఫార్మసీ)
జీతం : రూ. 12,500
ఫార్మసీ అసిస్టెంట్ (ఏదేని డిగ్రీ)
జీతం : రూ. 25,000
ఖాళీలు : 100
జాబ్ మేళాకు సంబంధించి తదితర వివరాల కోసం హెచ్ఆర్ రఘుపతి(8247656356)ను సంప్రదించొచ్చు.
సంబంధిత వార్తలు

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
జులై 26, 2026
తాజావార్తలు
- ●Ramchander Rao | కార్గిల్ విజయ్ దివస్.. సైనికుల అసమాన పరాక్రమానికి ప్రతీక: ఎన్. రామచందర్ రావు
- ●Health Tax | జంక్‌ఫుడ్‌పై హెల్త్ ట్యాక్స్!
- ●Pralhad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ
- ●Asaduddin Owaisi | యూపీ ఎలక్షన్స్: అఖిలేష్ యాదవ్‌కు అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్.. 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అంటూ బీజేపీ సెటైర్లు
- ●Rahul Gandhi | విద్యార్థులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? అమిత్ షాను నిలదీసిన రాహుల్
- ●Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్

Ramchander Rao | కార్గిల్ విజయ్ దివస్.. సైనికుల అసమాన పరాక్రమానికి ప్రతీక: ఎన్. రామచందర్ రావు

Health Tax | జంక్‌ఫుడ్‌పై హెల్త్ ట్యాక్స్!

Pralhad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ

Asaduddin Owaisi | యూపీ ఎలక్షన్స్: అఖిలేష్ యాదవ్‌కు అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్.. 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అంటూ బీజేపీ సెటైర్లు



