త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan extends birthday wishes to KCR | కేసీఆర్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ లేఖ.. జన్మదినం నాడు ఏం కోరుకున్నారంటే?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక లేఖ రాశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజా సేవలో మరింత చురుగ్గా ఉండాలని ఆకాంక్షించారు.

J

Telangana | Published On Feb 17, 2026, 3.04 pm IST

Pawan Kalyan extends birthday wishes to KCR | కేసీఆర్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ లేఖ.. జన్మదినం నాడు ఏం కోరుకున్నారంటే?
Advertisement

Pawan Kalyan extends birthday wishes to KCR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ఆయన ఒక అధికారిక లేఖను విడుదల చేశారు.

లేఖలోని ముఖ్యాంశాలు

మాజీ సీఎం కేసీఆర్‌కి పవన్ కళ్యాణ్ రాసిన లేఖలో ఆయన ప్రజా జీవితాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడాయన" అని కొనియాడారు. కేసీఆర్‌కి భగవంతుడు మరింతగా ప్రజా సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కేసీఆర్ పుట్టినరోజున, పవన్ కళ్యాణ్ స్వయంగా లేఖ రాసి శుభాకాంక్షలు తెలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

https://x.com/APDeputyCMO/status/2023619491062833167

 

Advertisement
Advertisement