త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Chandrababu | కేసీఆర్ కలెక్టరేట్ బాగుందయ్యా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు కితాబు

CM Chandrababu | భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) నాయుడు జిల్లా కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగారు. దిగగానే కలెక్టరేట్ నూతన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయిన చంద్రబాబు, అక్కడ తనకు స్వాగతం పలికిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు( Tummala Nageshwar Rao )తో కేసీఆర్( KCR ) గురించి ప్రస్తావించారు.

S

Telangana | Published On Nov 27, 2026, 5.49 pm IST

CM Chandrababu | కేసీఆర్ కలెక్టరేట్ బాగుందయ్యా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు కితాబు
Advertisement

క‌లెక్ట‌రేట్‌లా లేదు.. రాష్ట్ర స‌చివాల‌యంలా ఉంది..

CM Chandrababu | త్రినేత్ర న్యూస్ : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) నాయుడు జిల్లా కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగారు. దిగగానే కలెక్టరేట్ నూతన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయిన చంద్రబాబు, అక్కడ తనకు స్వాగతం పలికిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు( Tummala Nageshwar Rao )తో కేసీఆర్( KCR ) గురించి ప్రస్తావించారు.

"తెలంగాణలో 33 జిల్లాల్లో ఇలాంటి అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించారని విన్నాను. నిజంగా ఇది జిల్లా కలెక్టరేట్‌లా లేదు, రాష్ట్ర స‌చివాల‌యంలా ఉంది. కేసీఆర్ కలెక్టరేట్ బాగుందయ్యా.. ఇలాంటి విజన్ ఉండడం గొప్ప విషయం" అంటూ కేసీఆర్ పాలనను, ఆయన దూరదృష్టిని చంద్ర‌బాబు కొనియాడారు.

ఒక్కసారిగా ఏపీ సీఎం నోటి నుండి కేసీఆర్ పేరు రావడంతో అక్కడున్న మంత్రి,అధికారులు, నాయకులు ఒకింత ఆశ్చర్యానికి గురైన‌ట్లు స‌మాచారం.

చంద్ర‌బాబు కొత్త‌గూడెం ఎందుకు వ‌చ్చారంటే..?

నవ లిమిటెడ్ ఛైర్మన్ దేవినేని అశోక్, రమ దంపతుల ఆహ్వానం మేరకు నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే సుదర్శన హోమంలో పాల్గొనేందుకు చంద్రబాబు దంపతులు విచ్చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు తిరిగి విజయవాడ వెళ్లిపోగా, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే యాగంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి అక్కడే ఉండిపోయారు.

ఎమ్మెల్యే కూనంనేని.. సీఎం చంద్ర‌బాబుకు విన‌తి

హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ కొద్ది సమయంలోనే ఏపీ సీఎంకు ఒక కీలక వినతిపత్రాన్ని అందించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు పేరిట ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. నాటి నుంచి భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎనిమిది గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి, ఆ ప్రాంత భౌగోళిక విస్తరణకు ఈ పంచాయతీలు అత్యంత కీలకమని, పరిపాలనాపరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ నేతలు మొదటి నుంచీ వాదిస్తున్నారు. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా కూనంనేని నేరుగా వినతిపత్రం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement