త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్

Vivek Venkata Swamy | పెద్ద‌ప‌ల్లి ఎంపీ వంశీకృష్ణ (MP Vamshi Krishna), మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) వివాదంతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి (Vivek Venkata Swamy) అన్నారు.

S

Telangana | Published On Nov 26, 2026, 7.42 pm IST

Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్
Advertisement

Vivek Venkata Swamy | త్రినేత్ర న్యూస్‌: పెద్ద‌ప‌ల్లి ఎంపీ వంశీకృష్ణ (MP Vamshi Krishna), మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) వివాదం(Dispute)తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి (Vivek Venkata Swamy) అన్నారు. వంశీకృష్ణ‌ ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన వ్యవహారాలను ఆయనే చూసుకుంటారన్నారు. తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని, తాను పార్టీ మారుతానని ప్రచారం చేయడానికి కొంతైనా విచక్షణ ఉండాలని వ్యాఖ్యానించారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని స్పష్టం చేశారు. హైద‌రాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్ సందీప్‌తో ఎంపీ వంశీకృష్ణతో క‌లిసిన సంద‌ర్భంగా వివేక్ మాట్లాడారు.

పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్‌ను రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కలిశారు. బి.ఎం. సందీప్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పార్టీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై మాట్లాడారు.

శిలాఫ‌ల‌కంలో సీఎం, మంత్రి పేరు లేకపోవడంతో..

అయితే పెద్దపల్లి జిల్లా మంథనిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకం విష‌యంలో ఎంపీ వంశీకృష్ణ సీఎస్‌కు లేఖ రాశారు. ‘‘ శిలాఫలకంపై సీఎం, సంబంధిత శాఖ మంత్రి పేరు లేద‌ని.. సమస్య శిలాఫలకంపై కాదు.. ఆలోచనలోనే ఉందన్నారు. సీఎం పేరు విస్మరించడం.. కార్యనిర్వాహక పదవి గౌరవానికి భంగమే’’ అని వంశీకృష్ణ‌ అన్నారు. ఈ పేర్ల విషయంలో విచారణ జరిపి వెంటనే మార్చేందుకు ఆదేశించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే పెద్దపల్లి జిల్లాకు చెందిన పార్టీ నేతలు గాంధీభవన్‌కు రావాలని సందీప్‌కుమార్‌ పిలుపునిచ్చినట్లు సమాచారం. ఈ సమావేశం కోసం ఎంపీ వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా గాంధీభవన్‌కు వచ్చారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement