త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నేను నిఖార్స‌యిన తెలంగాణ బిడ్డను..

CM Revanth Reddy | నేను నిఖార్స‌యిన తెలంగాణ బిడ్డ‌ను అని సీఎం రేవంత్ రెడ్డి( CM revanth Reddy ) పేర్కొన్నారు. నా ర‌క్తంలో, నా డీఎన్ఏలో.. నా ప్రాంతం, నా తెలంగాణ‌, నా క‌మిట్‌మెంట్ క‌నిపిస్త‌ది సీఎం తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Nov 26, 2026, 7.36 pm IST

CM Revanth Reddy | నేను నిఖార్స‌యిన తెలంగాణ బిడ్డను..
Advertisement

నాలో పాల‌మూరు బిడ్డ‌ల పౌరుషం, ర‌క్తం ప్ర‌వ‌హిస్తుంది
అచ్చంపేట బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : నేను నిఖార్స‌యిన తెలంగాణ బిడ్డ‌ను అని సీఎం రేవంత్ రెడ్డి( CM revanth Reddy ) పేర్కొన్నారు. నా ర‌క్తంలో, నా డీఎన్ఏలో.. నా ప్రాంతం, నా తెలంగాణ‌, నా క‌మిట్‌మెంట్ క‌నిపిస్త‌ది సీఎం తేల్చిచెప్పారు. అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నీలాగా దోకేబాజ్ ద్రోహిని కాదు.. ఆ ర‌క్తం నాలో లేదు అని హ‌రీశ్‌రావును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. నాలో ఉన్న‌ది పాల‌మూరు బిడ్డ‌ల పౌరుషం.. ఆ ర‌క్తం ప్ర‌వ‌హిస్తుంది. అలాంటిది నా మీద అభాండాలు వేసి మీరు చేసిన త‌ప్పుల నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారా..? అని సీఎం మండిప‌డ్డారు. అసెంబ్లీలో మామఅల్లుళ్ల బాగోతం బ‌య‌ట‌పెడుతామ‌ని చెప్పారు.

Advertisement
Advertisement