త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alias Rukmini Trailer | బూతు న‌వ‌ల‌ల‌ ర‌చ‌యిత‌గా నితిన్ – అలియాస్ రుక్మిణి ట్రైల‌ర్ రిలీజ్‌

నితిన్ హీరోగా న‌టిస్తోన్న అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబ‌ర్ 4న రిలీజ్ కాబోతుంది. గురువారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బూతు న‌వ‌ల‌లు రాసే ర‌చ‌యిత‌గా నితిన్ క‌నిపించారు. ల‌వ్, ఎమోష‌న‌ల్ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. అలియాస్ రుక్మిణి సినిమాకు హీరో నాని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.

N

Entertainment | Published On Nov 26, 2026, 7.05 pm IST

Alias Rukmini Trailer | బూతు న‌వ‌ల‌ల‌ ర‌చ‌యిత‌గా నితిన్ – అలియాస్ రుక్మిణి ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Alias Rukmini Trailer | నితిన్ క‌థానాయ‌కుడిగా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న సినిమా అలియాస్ రుక్మిణి. హీరో నాని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నఈ సినిమాకు దండోరా ఫేమ్ ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలియాస్ రుక్మిణితో బాలీవుడ్ హీరోయిన్ అఫీయా స‌య్య‌ద్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. డిసెంబ‌ర్ 4న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

ట్రైల‌ర్ రిలీజ్‌...

అలియాస్ రుక్మిణి ట్రైల‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ల‌వ్‌, ఎమోష‌న‌ల్ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూ మారుపేరుతో న‌వ‌ల‌లు రాసే కృష్ణ అనే యువ‌కుడిగా ఈ ట్రైల‌ర్‌లో నితిన్ క‌నిపించారు. బూతు ర‌చ‌యితగా ముద్ర‌ప‌డ‌టంతో అత‌డికి వ‌చ్చిన పెళ్లి సంబంధాలు అన్ని రిజెక్ట్ అవుతున్నాయి.

ఎన్నో పెళ్లిచూపులు...

అఫీయా స‌య్య‌ద్‌తో పెళ్లిచూపుల సీన్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. నీకు ఇది ఎన్నో పెళ్లిచూపులు అని హీరోయిన్ అడిగిన ప్ర‌శ్న‌కు ఫోర్త్ అని నితిన్ స‌మాధానం చెప్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిని రిజెక్ట్ చేశావు..ఇది నాల్గొవ‌ది అంతేగా అని అఫీయా స‌య్య‌ద్ అన‌గా...లేదు వాళ్లే న‌న్ను రిజెక్ట్ చేశార‌ని నితిన్ చెప్ప‌డం న‌వ్వించింది.

బ‌రాబ‌ర్ ఏడుస్తా...

ప్రేమించి అమ్మాయితో ఏడ‌డుగులు వేసిన కృష్ణ కాపురంలో అత‌డి ర‌చ‌న‌ల కార‌ణంగా క‌ల‌త‌లు రేగిన‌ట్లుగా ట్రైల‌ర్‌లో చూపించారు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అమ్మాయి వ‌స్తుందా అని తండ్రి అన‌గానే....ఏడుస్తా...నా ఫీలింగ్స్ నా ఇష్టం. నొప్పి నాది క‌దా...బ‌రాబ‌ర్ ఏడుస్తా అంటూ నితిన్ చెప్పే ఎమోష‌న‌ల్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ఎండ్ అయ్యింది.

నాని సోద‌రి....

నితిన్ గ‌త సినిమాల‌కు భిన్న‌మైన కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. యాక్ష‌న్, మాస్ హంగుల‌కు దూరంగా ద‌ర్శ‌కుడు ముర‌ళీకాంత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. అలియాస్ రుక్మిణిలో సాయికుమార్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై నాని సోద‌రి దీప్తి ఘంటా ఈ సినిమాను నిర్మిస్తోంది.
విజ‌య్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement
Advertisement