Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దొంగతనం, లంగతనంతోనే విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
- సింగరేణి బొగ్గు ఉన్నా కొత్తగూడెంలో ఎందుకు బంద్ చేశారు?
- దొంగతనం, లంగతనంతోనే విద్యుత్ ఇవ్వడం లేదు
- ట్రాన్స్‌కోను రేవంత్ తన దోస్తులకు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారు
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు
Jagadeesh Reddy | త్రినేత్ర న్యూస్: నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దొంగతనం, లంగతనంతోనే విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అవినీతి సొమ్ముకు ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. పాలిచ్చే ఆవు లాంటి ట్రాన్స్‌కోను రేవంత్ తన దోస్తులకివ్వాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో విద్యుత్ పంపిణీని ఎక్కడ ప్రైవేటుపరం చేసినా ఫలితాలు రాలేదని చెప్పారు. ఒడిశా, ఢిల్లీ, ముంబైలో ప్రైవేటు పరం చేస్తే ఫెయిల్ అయ్యారన.. అక్కడ నల్లా బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. కరెంటును ప్రైవేటుపరం చేస్తే ప్రజల ఊపిరి ఆగిపోతుందని వాపోయారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌కో లక్షల కోట్ల ఆస్తులను రేవంత్ కారుచౌకగా అమ్మేయాలని చూస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అటకెక్కించింది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఘోరంగా విఫలమయ్యారు. కేసీఆర్ తెలంగాణను చీకటి నుంచి వెలుగుకు తీసుకెళ్లారు. సాధ్యం కాదన్న 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాలకు కొన్ని నెలల్లోనే అందించారు. 36 వేల కోట్లను ట్రాన్స్ కోపై వెచ్చించిన నేత కేసీఆర్. ఎక్కడ కరెంటు పోయినా ఒకచోటి నుంచి ఇంకో చోటుకు విద్యుత్ అందించే వ్యవస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఆనాడు కరెంటు పోతేనే వార్త అనే పరిస్థితి.
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళలో పవర్ ఉన్నా ఇవ్వలేమని అధికారులు అనేవారు. కేసీఆర్ సీఎంగా మొదటి రివ్యూ చేసింది విద్యుత్ పైనే. మొదటిసారి ఐఏఎస్ కు కాకుండా విద్యుత్ సంస్థల పగ్గాలు తెలంగాణ సోయి ఉన్న ఇతరులకు అప్పగించారు. ప్రభాకర్ రావు, రఘుమా రెడ్డీ శంకర్ నారాయణ్ నియామకాలు ఈ కోవలోనే జరిగాయి. కేసీఆర్ 2014, జూన్ 2న అధికారం చేపట్టి నవంబర్ నుంచి వ్యవసాయానికి తప్ప అన్ని రంగాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అధికారులు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వలేమన్నారు. సరైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేనందువల్ల ఇవ్వలేమన్నారు. మూడేళ్లలోనే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మెరుగుపరిచి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు.
28 వేల కిలోమీటర్లు విద్యుత్ లైన్లు వేశాం. అన్ని రకాల కేవీ సబ్ స్టేషన్ల సంఖ్యను ఎన్నో రెట్లు పెంచాం. ట్రాన్స్ కో లాభాల్లో నడుస్తోంది. ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోంది. అవినీతి సొమ్ముకు ఆశపడి ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రైవేటుకు ఎందుకు ఇవ్వాలి? ట్రాన్స్ కో లక్షల కోట్ల ఆస్తులను కారు చౌకగా అమ్మేయాలలని రేవంత్ చూస్తున్నారు. తక్కువ ధరకు దోస్తులకు కట్టబెట్టడం ఈ ప్రైవేటు పరం వెనక ఉన్న మతలబు. కేసీఆర్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా ఆనాడు విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు ఇవ్వలేదు. పవర్ జెనరేషన్ కాంట్రాక్టులను నాడు భేల్ కు, జెన్‌కోకు ఇచ్చారు. ట్రాన్స్ కో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
ప్రశ్నించిన అధికారులపై ఏసీబీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆర్టీసీ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు కేసీఆర్ వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ప్రైవేట్ పరం చేస్తే రైతులకు ఉచిత విద్యుత్ పై ప్రభావం పడుతుంది. ఇదో పెద్ద కుట్ర. ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు తెరవెనక మాట్లాడుకున్నారు. ప్రైవేటీకరణతో దళితులు ఇతర వర్గాలకు విద్యుత్ సబ్సిడీలు ఆగిపోతాయి. చార్జీలు పెరుగుతాయి. సీఎం ఆయన జీవితంలో నిజం మాట్లాడరు.
సమస్యలను డైవర్ట్ చేయడమే రేవంత్ పని.
జీ 9 బొగ్గు సింగరేణిలో ఉత్పత్తి అవుతుందని సాక్ష్యాధారాలతో బయట పెట్టాం. జనవరి 26 న సీఎం రివ్యూలోనే 13 జీ 9 రకం బొగ్గు గనుల్లో ఉత్పత్తి అవుతోందని అధికారులు చెప్పారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలు చెప్పారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం చేశారు. రేవంత్ చంద్రబాబు, డీకే శివకుమార్ ల ఆజ్ఞలు పాటిస్తూ ఏపీ కర్ణాటకలకు నాణ్యమైన బొగ్గు పంపుతున్నారు. యాదాద్రిలో జీ 6 నుంచి జీ 15 వరకు ఏ గ్రేడ్ నైనా వాడుకోవచ్చు. బొగ్గు లేని చోట పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు.
నైనీ ఎక్కడ ఉంది ఒడిశాలో.. బొగ్గు ఇక్కడికి తేవడం లేదా? గతంలో విజయవాడలో, రాయలసీమలో కట్టారు.. ఏం చెబుతారు. రాజస్థాన్ లో పవర్ ప్లాంట్ 3100 మెగావాట్లతో ఎందుకు పెట్టాలనుకున్నారు? అందులో 1500 సోలార్, 1600 థర్మల్ మెగావాట్లా? తెలంగాణకు హిమాచల్‌లో హైడెల్ ప్రాజెక్టు ఎందుకు? అది కొట్టుకుపోయింది. 52 కోట్లు ఇచ్చారు దాని మీద కూపీ లాగుతున్నాం. యాష్ మీద ఆధార పడే సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి దామరచర్లలో పవర్ ప్లాంట్ పెట్టాం. సింగరేణి బొగ్గు ఉన్నా కొత్తగూడెంలో ఎందుకు బంద్ చేశారు? పనికిమాలిన పనులకే సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు.
పవర్ ప్లాంట్లకు కాంగ్రెస్ దయ్యం పట్టింది. రేవంత్ డైవర్షన్ డ్రామాలతో ఎండుతున్న పొలాలు పండుతాయా? ఇంకో వంద మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను తట్టుకునే శక్తి తెలంగాణకు ఉంది. దసరా దాకా ఎందుకు? వెంటనే పూర్తి స్థాయి కరెంటు ఉత్పత్తికి సీఎం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
- ●Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!



