Jaipal Reddy | జైపాల్ రెడ్డి పేరిట మరో కొత్త జిల్లా..!
Jaipal Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల సంఖ్య 34కు చేరనుంది. కొత్త జిల్లా ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
కొత్త జిల్లా ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు
రూరల్ జిల్లాగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి
ఇక 34 జిల్లాలతో తెలంగాణ
Jaipal Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల సంఖ్య 34కు చేరనుంది. కొత్త జిల్లా ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికార యంత్రాంగం కూడా కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తన మామ జైపాల్ రెడ్డి పేరిట ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన విధంగానే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొద్దిరోజుల క్రితం వరకు 3 పోలీస్ కమిషనరేట్లు, మూడు జిల్లాలున్నాయి.
మూడు జిల్లాల పరిధిని మార్చేందుకు సన్నాహాలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధి నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా మార్చిన నేపథ్యంలో మూడు జిల్లాల పరిధిని కూడా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల బౌండరీలను మార్చేందుకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా ఓ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. వీటికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ జిల్లాలో మార్పులు, చేర్పులు
హైదరాబాద్ జిల్లాలో పలు మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలో 16 మండలాలున్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాలోకి మార్చనున్నట్లుగా సమాచారం. అమీర్‌పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని మల్కాజ్గిరి ప్రాంతంలో భాగం చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్‌పురలు ప్రస్తుతం ఉండగా, ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు విస్తరించనుంది. ఈ మండలాల్లో జీహెచ్‌ఎంసీ పరిధి ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాద్ జిల్లా పరిధిలోకి రానున్నట్లుగా తెలుస్తోంది.
అబ్దుల్లాపూర్‌మెట్‌పై నిర్ణయం పెండింగ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉంది. పునర్విభజన అనంతరం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాలు విలీనం కానున్నాయి. పునర్విభజన అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్(రంగారెడ్డి జిల్లా), కంటోన్మెంట్(హైదరాబాద్ జిల్లా) శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఉండగా అది జీహెచ్‌ఎంసీ పరిధి దాటి ఉండడం వల్ల ఈ మండలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో మార్పులు
రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలుండడం వల్ల అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించనున్నట్లుగా సమాచారం. సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారు. షాద్‌నగర్, శంషాబాద్ రూరల్ మండలం, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. జనగణన(సెన్సస్)-2027లో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరలోపు పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నామని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



