Grey-Collar Jobs | పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్
Grey-Collar Jobs | దీపావళి (Diwali) పండుగ వేళ గ్రే-కాలర్ ఉద్యోగాలకు (Grey-Collar Jobs) డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పండుగ సీజన్ సమయంలో తాత్కాలిక నియామకాలు 15% నుంచి 20% వరకు పెరిగినట్లు ఫెస్టివ్ సీజన్ వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ నివేదించింది.
Grey-Collar Jobs | త్రినేత్ర న్యూస్ : దేశంలో శారీరక శ్రమతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన గ్రే-కాలర్ ఉద్యోగాలకు (Grey-Collar Jobs) డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీపావళి (Diwali) పండుగ వేళ ఇ-కామర్స్, క్విక్ కామర్స్ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. దీంతో లాజిస్టిక్స్, సప్లై చైన్ రంగంలో (Indias logistics sector) గ్రే-కాలర్ (Grey-Collar) ఉద్యోగులకు (grey collar workers) భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పండుగ సీజన్ సమయంలో తాత్కాలిక నియామకాలు 15% నుంచి 20% వరకు పెరిగినట్లు ఫెస్టివ్ సీజన్ వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ నివేదించింది.
దీపావళి సమయంలో ఇ-కామర్స్ కంపెనీల ఆర్డర్లు సాధారణం కంటే 3 నుంచి 4 రెట్లు పెరుగుతాయి. షిప్‌మెంట్ వాల్యూమ్స్ దాదాపు 20% పెరగవచ్చని అంచనా. పండుగ రద్దీని ఎదుర్కొనేందుకు కంపెనీలు భారీగా నియామకాలు చేపడుతున్నాయి. అయితే, శారీరక శ్రమతోపాటూ డిజిటల్ నైపుణ్యాలు కలిగిన సరైన కార్మికులు దొరకడం ప్రస్తుతం సవాలుగా మారింది. పరిశ్రమ అందించే శిక్షణ కంటే గ్రే కాలర్ టాలెంట్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోందని ఎడ్జిస్టిఫై (Edgistify) సహ వ్యవస్థాపకులు, సీఓఓ అంతిమ్ సుమన్ తెలిపారు.
20 శాతం పెరిగిన నియామకాలు..
టీమ్‌లీజ్ (TeamLease) ఫెస్టివ్ సీజన్ వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం.. ప్రస్తుత పండుగ సీజన్‌లో లాజిస్టిక్స్ కంపెనీలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు భారీగా నియామకాలు చేపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఈ-కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో తాత్కాలిక నియామకాలు 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతాయని అంచనా. కంపెనీలు కేవలం పికర్స్, ప్యాకర్స్ కోసమే కాకుండా.. ఆటోమేషన్ ఆపరేటర్లు, ఇన్వెంటరీ కోఆర్డినేటర్లు, రిటర్న్స్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా కోరుకుంటున్నాయి.
గ్రే-కాలర్ ఉద్యోగులు అంటే ఎవరు?
కేవలం సాధారణ శారీరక పని కాకుండా, డిజిటల్ పరికరాలు, యాప్‌లు, టెక్నాలజీపై నైపుణ్యం కలిగిన వారిని గ్రే కాలర్ ఉద్యోగులు అంటారు. డిజిటల్ స్కాన్‌లను ఆపరేట్ చేసే వేర్‌హౌస్ ఉద్యోగులు, ఆటోమేటెడ్ సార్టింగ్ సిస్టమ్స్‌ను నిర్వహించే సిబ్బంది, యాప్‌లను ఉపయోగించే డెలివరీ పార్టనర్లు, డిజిటల్ డాక్యుమెంట్లను హ్యాండిల్ చేసే ట్రక్ డ్రైవర్లు కూడా వీళ్ల కిందకే వస్తారు.
ప్రస్తుతం ఈ ఉద్యోగాలు పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా మారిపోయాయి. డెలివరీ భాగస్వాములు నావిగేషన్, డెలివరీ రుజువుల కోసం యాప్‌లను ఉపయోగిస్తున్నారు. వేర్‌హౌస్ కార్మికులు ఇన్వెంటరీ సిస్టమ్స్, ఆటోమేటెడ్ పరికరాలను ఆపరేట్ చేస్తున్నారు. అంతేకాకుండా, అనుభవజ్ఞులైన ఉద్యోగులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు షిఫ్ట్‌లను కూడా నిర్వహించాల్సి వస్తోంది.
పెరుగుతున్న ఉపాధి అవసరాలు..
భారతదేశపు దీర్ఘకాలిక ఉపాధి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత లాజిస్టిక్స్ రంగం దాదాపు 22 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. లాజిస్టిక్స్, డెలివరీ కార్మికులతో కూడిన దేశ గిగ్ వర్క్‌ఫోర్స్ (gig workforce) 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ (NITI Aayog) అంచనా వేసింది. అలాగే 2030 నాటికి ఈ పరిశ్రమకు అదనంగా 47 లక్షల మంది కార్మికులు అవసరమవుతారని లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనా వేసింది.
శిక్షణే పెద్ద సవాల్..
టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగల కార్మికులు కంపెనీలకు చాలా అవసరం. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ రంగంలో శిక్షణే అతిపెద్ద సవాలుగా మారింది. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (LSSC) గణాంకాల ప్రకారం.. ఫ్రైట్ లాజిస్టిక్స్ వర్క్‌ఫోర్స్‌లో కేవలం 4 శాతం మంది మాత్రమే అధికారిక వృత్తివిద్యా శిక్షణ పొందారు. ఈ రంగంలో పనిచేస్తున్న మెజారిటీ డెలివరీ భాగస్వాములు ఎలాంటి ముందస్తు శిక్షణ లేకుండా, నేరుగా పనిలో చేరి అనుభవంతోనే విషయాలను నేర్చుకుంటున్నారు. అదే సమయంలో గ్రే-కాలర్ ఉద్యోగుల్లో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి త్వరగా మారిపోయే ధోరణి ఎక్కువగా ఉండటం వల్ల ఉత్పాదకత దెబ్బతింటోందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
నైపుణ్యాల కొరతను ఎలా అధిగమించవచ్చు..?
ఈ నైపుణ్యాల కొరతను అధిగమించడానికి లాజిస్టిక్స్ కంపెనీలు యువతకు మొబైల్-ఫస్ట్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్స్, షార్ట్-ఫార్మ్ వీడియోలు, అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా డిజిటల్ శిక్షణను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీలు తమ కార్మికులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను సృష్టించాలని పేర్కొంటున్నారు. ఒక డెలివరీ పార్టనర్ (Delivery Partner) స్థాయి నుంచి హబ్ సూపర్‌వైజర్ (Hub Supervisor) స్థాయికి ఎదిగే అవకాశం కల్పించడం, అలాగే వేర్‌హౌస్ పికర్ సైట్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరుకోగలగాలని చెబుతున్నారు. ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థల (Skill Development Councils) భాగస్వామ్యంతో కార్మికులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు అందించడం ద్వారా వారిలో వృత్తి పట్ల గౌరవం పెంచాలని సూచిస్తున్నారు.
Also Read..
వరదలు కాదు, యుద్ధాలూ కాదు.. సింధూ నాగరికత అంతం వెనుక మిస్టరీని ఛేదించిన సైంటిస్టులు
ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abhijit Dipke | దీపావళి వరకూ ఎలాంటి నిరసనలు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మద్దతుదారులకు దిప్కే పిలుపు
అక్టోబర్ 20, 2026

NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
అక్టోబర్ 13, 2026

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?
- ●Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్
- ●Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- ●Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో
- ●Stock Markets | ముడిచమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
- ●Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న: హరీశ్ రావు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?

Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్

Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..

Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో



