Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్
Revanth Reddy | దొరల దోపిడీకి, పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న (Panduga Sayanna) జయంతి సందర్భంగా ఆ పోరాట యోధునికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘనంగా నివాళులర్పించారు.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: దొరల దోపిడీకి, పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న (Panduga Sayanna) జయంతి సందర్భంగా ఆ పోరాట యోధునికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘనంగా నివాళులర్పించారు. అణగారిన ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, ఆకలితో అలమటించే పేదలకు అండగా నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రజావీరుడని స్మరించుకున్నారు.
అధికారం, ఆధిపత్యం కొందరి చేతుల్లోనే ఉన్న కాలంలో, అన్యాయాన్ని ప్రశ్నించి, పేదల పక్షాన నిలబడటమే నిజమైన ధైర్యమని తన పోరాటాల ద్వారా చాటిచెప్పిన సాయన్న జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం, ఆకలిలేని సమాజం కోసం సాగిన పోరాటానికి ప్రతీక పండుగ సాయన్న అని ముఖ్యమంత్రి కొనియాడారు.
గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక..
జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక కొమురం భీమ్ (Komaram Bheem) జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అణచివేతను ఎదిరించి, ఆదివాసీల హక్కుల సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని అన్నారు. అడవిపై హక్కు, భూమిపై అధికారం, ఆత్మగౌరవంతో జీవించే స్వేచ్ఛ కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న: హరీశ్ రావు
అక్టోబర్ 22, 2026

Liquor Sales | సర్కారుకు కాసుల వర్షం.. దుమ్మురేపిన దసరా లిక్కర్ సేల్స్
అక్టోబర్ 22, 2026

CM Revanth Reddy | మైసూరు దసరా ఉత్సవాలు.. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Cyber Robbery | హైదరాబాద్లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- ●Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో
- ●Stock Markets | ముడిచమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
- ●Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న: హరీశ్ రావు
- ●Nirmal | టర్కీలో ప్రమాదం.. నిర్మల్ జిల్లా యువకుడు మృతి
- ●Hyderabad | యువకుడికి గుండు గీయించి.. నగ్నంగా డ్యాన్స్ చేయించారు..

Cyber Robbery | హైదరాబాద్లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..

Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో

Stock Markets | ముడిచమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న: హరీశ్ రావు



