త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంట‌న్న‌ర‌లో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..

Cyber Robbery | డిజిటల్ విప్లవంతో పాటు సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు క్షణాల వ్యవధిలోనే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

G

Hyderabad | Published On Oct 22, 2026, 10.46 am IST

Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంట‌న్న‌ర‌లో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
Advertisement

Cyber Robbery | త్రినేత్ర న్యూస్‌: డిజిటల్ విప్లవంతో పాటు సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు క్షణాల వ్యవధిలోనే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ కంపెనీకి చెందిన బ్యాంక్ అకౌంట్ నుంచి కేవలం గంటన్నర వ్యవధిలోనే రూ.3.34 కోట్లు కాజేశారు (Cyber Robbery).

రాయ‌దుర్గం ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) సంస్థకు చెందిన బేగంపేట బ్రాంచ్ బ్యాంకు ఖాతా నుంచిరూ. 3.34 కోట్ల నిధుల‌ను సైబర్ నేరగాళ్లు మళ్లించారు. సంస్థ మెయిన్ స‌ర్వ‌ర్‌లోకి చొర‌బ‌డి కేవలం గంట‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే 183 విడ‌త‌ల్లో 52 వేర్వేరు మ్యూల్ ఖాతాల‌కు న‌గ‌దును బ‌దిలీ చేశారు. బ్రాంచ్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు మాయమవ‌డంతో కంపెనీ సీఎఫ్‌ఓ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు (TGCSB) ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి.. సాంకేతిక ఆధారాల సాయంతో నిధులు ఏ ఖాతాల్లోకి వెళ్లాయో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement