Rain Update | నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు
Rain Update | ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు (Rain Update) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉందని (IMD Hyderabad) తెలిపింది.
Rain Update | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో వాతావారణం కాస్త చల్లబడింది. ఎల్నినో ప్రభావంతో సూర్యూడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఎండ, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే శనివారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం (Rain) కురిసింది. దీంతో ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. కాగా, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు (Rain Update) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉందని (IMD Hyderabad) తెలిపింది. దీంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.
https://t.co/anszhGlqNG
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 17, 2026
ఇక సోమవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నంచి మోస్తారు వర్షం కురుస్తుందని వెల్లడించింది.
మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
OCTOBER 18, 2026 FORECAST ⚠️⛈️
Scattered INTENSE RAINS and T-STORMS across Nalgonda, Yadadri - Bhongir, Rangareddy, Mahabubabad, Wanaparthy, Gadwal, Narayanpet during afternoon to night ⚠️⛈️
ISOLATED T-STORMS across Vikarabad, Mahabubnagar, Khammam, Suryapet, Bhadradri - Kothagudem, Mulugu, Jangaon, Hanmakonda, Warangal, Medak, Siddipet, Sangareddy during afternoon to night
Other districts - isolated rain/dry
Hyderabad - A spell of scattered LIGHT - MODERATE RAINS and T-STORMS expected during late afternoon to night ⛈️👍
— Telangana Weatherman (@balaji25_t) October 18, 2026
తాజావార్తలు
- ●Bedi Anjaneya Swamy | ఆంజనేయుడికి బేడీలు ఎందుకు?
- ●Sheetla Mata Temple | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది దుర్మరణం
- ●Nalgonda Medical College | నల్లగొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వరకు దరఖాస్తులు
- ●Stampede | దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు
- ●Dandiya Event | దాండియా వేడుకలో కూలిన లైటింగ్ సిస్టమ్.. విద్యార్థిని మృతి
- ●Horoscope | అక్టోబర్ 18 రాశిఫలాలు.. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం!

Bedi Anjaneya Swamy | ఆంజనేయుడికి బేడీలు ఎందుకు?

Sheetla Mata Temple | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది దుర్మరణం

Nalgonda Medical College | నల్లగొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వరకు దరఖాస్తులు

Stampede | దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు






