Sonia Gandhi | ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా గాంధీ.. తొలి పోస్ట్ ఇదే..!
Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు (Instagram Debut). తన ఆత్మకథ 'బిలాంగింగ్' పుస్తకానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోని తొలి పోస్టుగా షేర్ చేశారు.
Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు (Instagram Debut). ఈ సందర్భంగా తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోని తొలి పోస్టుగా షేర్ చేశారు. ఆ బుక్‌లోని రాహుల్, ప్రింయాక గాంధీ చిన్ననాటి ఫొటోలను చూపిస్తూ మురిసిపోయారు.
"బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' ఫస్ట్ లుక్‌ను మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది" అంటూ పోస్టుకు క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. సోనియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవగానే వేలాది మంది ఆమెను ఫాలో అవ్వడం ప్రారంభించారు. అయితే, సోనియా మాత్రం ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో రాహుల్, ప్రియాంకతోపాటూ కాంగ్రెస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఫాలో అవుతుండటం విశేషం.
ఇదిలా ఉండగా.. సోనియా గాంధీ (Sonia Gandhi) ‘బిలాంగిగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఈ పుస్తక ప్రచురణ హక్కుల్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా (HarperCollins India) దక్కించుకుంది. నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ బుక్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హార్పర్ కాలిన్స్ ఇండియా తొలి ప్రచురణను సోనియాకు అందజేసింది.
యుద్ధానంతర ఇటలీలో బాల్యం, భారతదేశంలో తన జీవితం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమ-వివాహం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల తాలూకు విషాదాలు, రాజకీయ ప్రవేశం వంటి ఎన్నో వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాలను సోనియా ఈ ఆత్మకథలో పొందుపరిచారు. అంతేకాదు, 2004లో తాను ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందనే విషయాలను కూడా సోనియా ఈ బుక్‌లో వివరించారు.
Also Read..
పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్
కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో
వరదలు కాదు, యుద్ధాలూ కాదు.. సింధూ నాగరికత అంతం వెనుక మిస్టరీని ఛేదించిన సైంటిస్టులు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Grey-Collar Jobs | పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్
- ●Indus Valley Civilisation Collapse | వరదలు కాదు, యుద్ధాలూ కాదు.. సింధూ నాగరికత అంతం వెనుక 4,000 ఏళ్ల మిస్టరీని ఛేదించిన సైంటిస్టులు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?
- ●Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్
- ●Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- ●Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో

Grey-Collar Jobs | పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్

Indus Valley Civilisation Collapse | వరదలు కాదు, యుద్ధాలూ కాదు.. సింధూ నాగరికత అంతం వెనుక 4,000 ఏళ్ల మిస్టరీని ఛేదించిన సైంటిస్టులు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?

Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్






