త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jurala | జూరాల కాలువ‌కు నీళ్లు.. 14 మంది రైతుల‌పై కేసు న‌మోదు

Jurala | జూరాల‌కు కాలువ‌కు నీళ్లు వ‌దిలిన 14 మంది రైతుల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు అమ‌ర‌చింత ఎస్ఐ స్వాతి( SI Swathi ) తెలిపారు. ప్రాజెక్టు ఇరిగేష‌న్ డీఈ( Irrigation DE ) ఫిర్యాదు మేర‌కు రైతుల‌పై కేసు న‌మోదు చేశామ‌ని ఎస్ఐ పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 8, 2026, 4.09 pm IST

Jurala | జూరాల కాలువ‌కు నీళ్లు.. 14 మంది రైతుల‌పై కేసు న‌మోదు
Advertisement

Jurala | త్రినేత్ర న్యూస్ : త‌మ పంట‌లు ఎండిపోతున్నాయ‌ని, జూరాల( Jurala ) నుంచి నీళ్లు వ‌ద‌లాల‌ని రైతులు ప్ర‌భుత్వాన్ని వేడుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం రైతుల( Farmers ) గోస‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. అన్న‌దాత‌లే నేరుగా జూరాల గేట్ల‌ను బ‌ల‌వంతంగా ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలో జూరాల‌కు కాలువ‌కు నీళ్లు వ‌దిలిన 14 మంది రైతుల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు అమ‌ర‌చింత ఎస్ఐ స్వాతి( SI Swathi ) తెలిపారు. ప్రాజెక్టు ఇరిగేష‌న్ డీఈ( Irrigation DE ) ఫిర్యాదు మేర‌కు రైతుల‌పై కేసు న‌మోదు చేశామ‌ని ఎస్ఐ పేర్కొన్నారు.

అసలేం జ‌రిగిందంటే..?

సాగునీరు అంద‌క త‌మ పంట‌లు ఎండిపోతున్నాయ‌ని జూరాల ఆయ‌క‌ట్టు రైతులు ఆందోళ‌న‌కు దిగిన విష‌యం విదిత‌మే. సాగునీటిని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని అన్న‌దాత‌లు ఆందోళ‌న‌కు దిగారు. అయినా కూడా ఇరిగేష‌న్ అధికారులు రైతుల‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 19న సాయంత్రం రైతులే బ‌ల‌వంతంగా జూరాల గేట్ల‌ను ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలో ప్రాజెక్టు ఇరిగేష‌న్ డీఈ ఫిర్యాదు మేర‌కు కేసులు న‌మోద‌య్యాయి. మరోవైపు జూరాల నుంచి సాగునీరు అందించాలని 21వ తేదీన జమ్మిచేడు వద్ద ధర్నా చేసిన బీఆర్‌ఎస్‌, భాజపా నేతలపైనా కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement