Jupally Krishna Rao | ఫైళ్లు, విధులతో పాటు క్రీడలు, కళలపై ఆసక్తిని పెంచుకోవాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao | ఉద్యోగులకు విధులతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పని సామర్థ్యంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు.
Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్: ఉద్యోగులకు విధులతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పని సామర్థ్యంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు. డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి స్పెషల్ సీఎస్ మహేష్ దత్ హెక్కాతో పాటు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. ఉద్యోగులు నిత్యం ఎంతో బిజీగా, పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తుంటారని తెలిపారు. క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉద్యోగులు కేవలం ఫైళ్లు, విధులు, బాధ్యతలకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను కూడా వెలికితీయాలని సూచించారు. గెలుపు, ఓటమి కంటే కార్యక్రమాల్లో పాల్గొనడం, తమ ప్రతిభను ప్రదర్శించడం, సహోద్యోగులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యమని చెప్పారు.
ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని జూపల్లి సూచించారు. ఉద్యోగులు బాగా పనిచేస్తే దాని ప్రభావం ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందే సేవలపై ఉంటుందని అన్నారు. విధులతో పాటు ఆటలు, క్రీడలు, పాటలపై ఆసక్తి పెంచుకోవడం వల్ల ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పేర్కొన్నారు. దేశానికి ఎంతో ప్రాచీనమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉన్నాయని మంత్రి తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం తమ పిల్లలకు భారతీయ కళలు, సంస్కృతిని నేర్పిస్తున్నారని గుర్తుచేశారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మన పూర్వీకులు అందించిన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
అప్పుడు పాటలే నాకు స్ఫూర్తి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. 2011లో ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆటపాటలే తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాధాకృష్ణ, తెలంగాణ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జే. ప్రేమ్, ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్, కల్చరల్ సెక్రటరీ యామిని కనకతార తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
- ●OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..
- ●Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియనేస్తం - బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో - హోస్ట్‌గా హనుమాన్ హీరో
- ●UP Police Viral Video | రక్షణ కల్పించాల్సింది పోయి రికార్డింగ్స్ ఏంటి?: కాశీలో డ్యాన్సర్లను వీడియో తీసిన యూపీ పోలీసులు.. నెటిజన్లు ఫైర్
- ●HYDRAA | సున్నం చెరువు, తమ్మిడికుంట అభివృద్ధిపై హైడ్రా ఫోకస్
- ●Assam Rifles | అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు.. జవాను వీరమరణం

Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం

OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..

Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియనేస్తం - బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో - హోస్ట్‌గా హనుమాన్ హీరో

UP Police Viral Video | రక్షణ కల్పించాల్సింది పోయి రికార్డింగ్స్ ఏంటి?: కాశీలో డ్యాన్సర్లను వీడియో తీసిన యూపీ పోలీసులు.. నెటిజన్లు ఫైర్









