AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్
AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ శుక్రవారం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా లెనిన్(ఓయూ), నెల్లి సత్య(హైదరాబాద్) ఎన్నికయ్యారు.
AISF | త్రినేత్ర న్యూస్ : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ శుక్రవారం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా లెనిన్(ఓయూ), నెల్లి సత్య(హైదరాబాద్) ఎన్నికయ్యారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవాలు హన్మకొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఘనంగా జరిగాయి. ఏఐఎస్ఎఫ్ 90 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం పోరాటాలు, విజయాలు, మాజీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం, విద్యారంగ సమస్యలపై చర్చించారు. 30వ తేదీ న రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర నూతన ఆఫీస్ బేరర్స్ కమిటీని ఎన్నుకున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి(కరీంనగర్), రాష్ట్ర కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్(మేడ్చల్) లను మరోసారి ఎన్నికైనట్లు అదే విధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటిక్యాల రామకృష్ణ(ఖమ్మం )రాష్ట్ర కార్యవనిర్వహక కార్యదర్శిగా రెహమాన్(నల్గొండ), రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బానోత్ రఘురాం నాయక్( నిజామాబాద్), లెనిన్ (ఉస్మానియా యూనివర్సిటీ), ముదిగొండ మురళికృష్ణ(నల్గొండ), బలుముల ప్రేమ్ కుమార్(నాగర్ కర్నూల్), రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా భాషబోయిన సంతోష్(హన్మకొండ), నెల్లి సత్య(హైదరాబాద్), సామిడి వంశీవర్ధన్ రెడ్డి(రంగారెడ్డి), జేరిపోతుల జనార్ధన్(సిద్దిపేట) ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ తెలిపారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయ , ఈ వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యలపై చర్చించాం. భవిష్యత్ కార్యచరణ రూపొందించుకున్నామని, దేశంలో రాష్ట్రంలో పాలకులు విద్యారంగాన్ని విస్మరిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణకు కుట్ర చేస్తున్నదని, తెలంగాణ విభజన హామీల ప్రకారం రాష్టానికి కేటాయించాల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా తెలంగాణ పట్ల చిన్న చూపు చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, విద్యకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకుండా, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించకుండా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత విద్యాశాఖను పెట్టుకొని విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాష్ట్రంలో మద్యం షాపులను పెంచుతూ ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు కుట్ర చేస్తున్నారని రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం కోసం పోరాటాలు నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి లక్ష్మణ్ తెలిపారు.
తాజావార్తలు
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●Kakatiya Kala Thoranam | రూ.10 లక్షల బిడ్‌తో టాప్-3లో కాకతీయ కళాతోరణం
- ●MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్

Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ




