Model Schools | మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు.. 28 నుంచి దరఖాస్తులు
Model Schools | వచ్చే విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో (Model Schools) ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరాఖస్తు చేసుకోవచ్చు.
త్రినేత్ర.న్యూస్: వచ్చే విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో (Model Schools) ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరాఖస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా ఆరో తరగతి సీట్లతో పాటు 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా, ప్రతి ఏడాది డిసెంబరులోనే నోటిఫికేషన్ వచ్చేది. కానీ ఈ సారి కొంత ఆలస్యమైంది. గురుకులాల తరహాలోనే మోడల్ స్కూళ్లలో కూడా ఐదో తరగతిని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన సర్కార్ వద్ద పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం.
ప్రతి మోడల్ స్కూల్లో ఆరో తరగతి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 50 చొప్పున 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. అంటే రాష్ట్రంలోని 194 పాఠశాలల్లో 19,400 సీట్లు ఉన్నాయన్నమాట. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు www.tgms.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులు రూ.200, మిగిలిన వారు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7- 10 తరగతులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అన్ని మోడల్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



