Ambedkar Open University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
Ambedkar Open University | హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ (Ambedkar Open University) డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు (Admissions) నోటిఫికేషన్ విడుదలైంది.
Ambedkar Open University | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ (Ambedkar Open University) డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు (Admissions) నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ (బీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ), పీజీలో ఎంఏ (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, అర్ధశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), ఎంకాం, ఎంఎస్సీ (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఫిజిక్స్, కెమెస్ట్రీ, పర్యావరణ శాస్త్రం, మ్యాథ్స్, అనువర్తిత గణితశాస్త్రం), ఎంఎల్ ఐఎస్సీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు Http://www.brauonline.in, www.braou.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 73829 29570, 040-23680222/333/555లో లేదా టోల్ ఫ్రీ నం.18005990101లో సంప్రదించవచ్చు.
విద్యార్హతలు
డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా పదో తరగతి తర్వాత ఏదైనా రెండేండ్ల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, లేదా ఓపెన్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా ఈ కోర్సులకు అర్హులు.
ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును ఆగష్టు 7లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
డిగ్రీ 2021-22 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెందిన రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు... అలాగే పీజీ 2023-24 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెంది, సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఇప్పుడు తమ ట్యూషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు.
తాజావార్తలు
- ●Englad Vs Ghana | తడబడిన ఇంగ్లండ్
- ●Sanjay Jaju | 12 ఏండ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి.. కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు!
- ●Portugal vs Uzbekistan | పోర్చుగల్‌కు తొలి విజయం
- ●Horoscope | జూన్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆ పనులతో ప్రమాదం పొంచి ఉంది!
- ●Ukraine Army Of Witches | రష్యన్లకు వల వేస్తున్న 'మంత్రగత్తెల ఆర్మీ'.. హనీట్రాప్‌తో అంతుచూస్తున్న ఉక్రెయిన్ మాస్టర్ మైండ్!
- ●Bengaluru Auto Scam | బెంగళూరులో 'ఆటో' దౌర్జన్యం.. అమాయక యువకులపై దాడి చేసి డబ్బుల వసూలు! చివరగా పట్టించిన యూపీఐ

Englad Vs Ghana | తడబడిన ఇంగ్లండ్

Sanjay Jaju | 12 ఏండ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి.. కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు!

Portugal vs Uzbekistan | పోర్చుగల్‌కు తొలి విజయం

Horoscope | జూన్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆ పనులతో ప్రమాదం పొంచి ఉంది!






