త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nalgonda Medical College | నల్ల‌గొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

Nalgonda Medical College | త్రినేత్ర న్యూస్‌: న‌ల్ల‌గొండ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో (Nalgonda Medical College) 2026–2027 విద్యా సంవత్సరానికి గాను రెండు సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో (Paramedical Diploma Courses) ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

G

Telangana | Published On Oct 18, 2026, 7.38 am IST

Nalgonda Medical College | నల్ల‌గొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు
Advertisement

Nalgonda Medical College | త్రినేత్ర న్యూస్‌: న‌ల్ల‌గొండ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో (Nalgonda Medical College) 2026–2027 విద్యా సంవత్సరానికి గాను రెండు సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో (Paramedical Diploma Courses) ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు తెలంగాణ పారామెడిక‌ల్ బోర్డు (TGPMB) నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 24 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోచ్చు. మొత్తం 60 సీట్లు ఉన్నాయి.

మొత్తం సీట్లు: 60
డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ (DANS)- 30
డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్- 30

అర్హ‌త‌లు: అభ్య‌ర్థులు ఇంట‌ర్‌లో బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. సీట్ల‌కు స‌రిప‌డా బైపీసీ విద్యార్థులు లేన‌ట్ల‌యితే ఎంపీసీ ఉత్తీర్ణులైన‌వారితో భ‌ర్తీచేస్తారు. 16 సంవత్సరాలు నిండి, తప్పనిసరిగా తెలంగాణ స్థానికత కలిగి ఉండాలి.
ఎంపిక‌: ఇంట‌ర్ మార్కుల ఆధారంగా

ఫీజు వివరాలు: ప్రభుత్వ పారామెడికల్ సంస్థల నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు నెలకు రూ. 500 (సంవత్సరానికి రూ. 6,000) చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర ప్రత్యేక ఫీజులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారానికి అవసరమైన సర్టిఫికెట్లు, ప్రాసెసింగ్ రుసుము(నగదు రూపంలో) జత చేసి నల్ల‌గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు: రూ. 100
దరఖాస్తుల‌కు చివరి తేదీ: అక్టోబ‌ర్ 24
వెబ్‌సైట్‌: www.tgpmb.telangana.gov.in

Advertisement
Advertisement