త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRAOU | రేపు అంబేద్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం

BRAOU | డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ క్యాంపస్ భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి వెల్లడించారు.

S

Hyderabad | Published On Oct 6, 2026, 4.48 pm IST

BRAOU | రేపు అంబేద్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
Advertisement

BRAOU | త్రినేత్ర న్యూస్ : డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ క్యాంపస్ భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి వెల్లడించారు.

ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఎం.ఫిల్, పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు, బుక్ ప్రైజ్‌లను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్, యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవంలో ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటులు బి. నరసింగరావుకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

స్నాతకోత్సవంలో ప్రభుత్వ అధికారులు, ఉన్నత విద్యాసంస్థల అధికారులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, డైరెక్టర్లు హాజరు కానున్నారు. స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ/పీజీ/డిప్లొమా/సర్టిఫికెట్లు కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో 38 బంగారు పతకాలు, 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డీ, ఒకరికి ఎం.ఫిల్ డిగ్రీ ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవంలో 26 మంది పురుష ఖైదీలు, ఒక మహిళా ఖైదీతో సహా మొత్తం 27 మంది (చెర్లపల్లి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు నుండి) డిగ్రీలు అందుకోనున్నారు. స్నాతకోత్సవానికి వచ్చే విద్యార్థులకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్లు , జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ నుంచి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement