త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adi Sriniva | ఫీజు బ‌కాయిలపై ల‌డాయి అంటూ బ‌డాయికి పోతున్న బీజేపీ: ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Sriniva | ఫీజు బ‌కాయి.. బీజేపీ (BJP)ల‌డాయి అంటూ ఆ పార్టీ బ‌డాయికి పోతున్న‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, వేముల‌వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Sriniva) విమ‌ర్శించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై (Fee Reimbursement) బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు నిరాహార దీక్ష చేస్తాన‌ని హ‌డావుడి చేస్తున్నాడ‌ని..

G

Telangana | Published On Aug 24, 2026, 11.57 am IST

Adi Sriniva | ఫీజు బ‌కాయిలపై ల‌డాయి అంటూ బ‌డాయికి పోతున్న బీజేపీ: ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్
Advertisement

Adi Sriniva | త్రినేత్ర‌.న్యూస్‌: ఫీజు బ‌కాయి.. బీజేపీ (BJP)ల‌డాయి అంటూ ఆ పార్టీ బ‌డాయికి పోతున్న‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, వేముల‌వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Sriniva) విమ‌ర్శించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై (Fee Reimbursement) బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు నిరాహార దీక్ష చేస్తాన‌ని హ‌డావుడి చేస్తున్నాడ‌ని.. గ‌త ప్ర‌భుత్వం రూ.8 వేల కోట్ల బ‌కాయిలు పెట్టింద‌ని, మ‌రి గ‌త ప‌దేండ్ల‌లో నిరాహార దీక్ష‌లు ఎందుకు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌పై (KCR) ఎందుకు పోరాటాలు చేయ‌లేద‌ని నిల‌దీశారు. గ‌త ప్ర‌భుత్వం పెట్టిన‌ పెట్టిన బ‌కాయిల గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వాన్నే ఎందుకు బ‌ద‌నాం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కాంగ్రెస్‌ (Congress) ప్ర‌భుత్వం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకుపోతున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌తి యేడాది ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం రూ.2300 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుత‌ విద్యా సంవ‌త్సరం నుంచి గ్రీన్ ఛాన‌ల్‌లో డ‌బ్బును విద్యార్థుల ఖాతాల్లో నేరుగా వేయ‌నున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే రూ.300 కోట్లు అడ్వాన్స్‌గా బ్యాంకులో సిద్ధం చేసి ఉంచామ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా వివ‌రించామ‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్ది కూడా ఇటీవల చాలా స్ప‌ష్టంగా తెలియ‌జేశార‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం పెట్టిన బ‌కాయిల‌ను (Pending Fees) కూడా త‌మ‌ ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తున్న‌ద‌ని చెప్పారు. ఈ కార‌ణంగానే కొంత ఇబ్బంది వ‌చ్చింద‌ని, త‌మ‌ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న బ‌కాయిల‌ను కూడా చెల్లిస్తామ‌న్నారు. దానికోసం ఒక‌ విధానాన్ని రూపొందిస్తున్నామ‌ని చెప్పారు.

ఆ అర్హ‌త లేదు..

విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక అర్హ‌త బీజేపీ (BJP) నేత‌ల‌కు ఏమాత్రం లేద‌ని విమ‌ర్శించారు. విద్యార్థుల విష‌యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌యింద‌ని చెప్పారు. నీట్ పేప‌ర్ లీక్‌తో విద్యార్థుల జీవితాల‌తో ఆడుకున్నార‌ని, కేంద్ర విద్యా శాఖ మంత్రితో రాజీనామా చేయించార‌ని గుర్తుచేశారు. త‌మ‌ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏ పేప‌ర్ లీక్ కాకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని స్ప‌ష్టం చేశారు. స్వ‌యంగా విద్యా శాఖను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చూస్తున్నారని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌ను నిర్మించుకుంటున్నామ‌ని, సంక్షేమ హాస్ట‌ల్స్‌లో ఉండే విద్యార్థుల‌కు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామ‌ని చెప్పారు. విద్య‌ను సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అందుకే అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి భావించార‌ని, కానీ కేంద్ర ప్ర‌భుత్వం మోకాలు అడ్డిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు వెళ్ల‌నివ్వ‌లేదో ముందు బీజేపీ నాయ‌కులు స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అంద‌కుండా చేసిన తెలంగాణ బీజేపీ (Telangana BJP) నాయ‌కులు ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. తెలంగాణ విద్యార్థులు బీజేపీ నేత‌ల తీరును గ‌మ‌నించి ఖండించాలన్నారు.

Advertisement
Advertisement