త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..

IPO | ప్రైమరీ మార్కెట్‌లో మరోసారి సందడి నెలకొననుంది. ఈ వారం మొత్తం 10 కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్లను (ఐపీఓ) ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మూడు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఉన్నాయి. ఈ మూడు ఇష్యూల ద్వారా కలిపి రూ.2,475 కోట్లకు పైగా సమీకరించాలని కంపెనీలు లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నాయి.

S

Business | Published On Aug 24, 2026, 11.18 am IST

IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..
Advertisement

IPO | ప్రైమరీ మార్కెట్‌లో మరోసారి సందడి నెలకొననుంది. ఈ వారం మొత్తం 10 కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్లను (ఐపీఓ) ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మూడు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఉన్నాయి. ఈ మూడు ఇష్యూల ద్వారా కలిపి రూ.2,475 కోట్లకు పైగా సమీకరించాలని కంపెనీలు లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నాయి. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్, హై-టెక్ ఇంజినీర్స్ సంస్థలు సోమవారం తమ ఐపీఓలను ప్రారంభించనున్నాయి. దీంతో ఈ వారం పబ్లిక్ ఇష్యూల సందడి మొదలుకానుంది. వీటితో పాటు మరో ఐదు మెయిన్‌బోర్డ్, ఎస్‌ఎంఈ ఇష్యూలు కూడా వరుసలో ఉన్నాయి. అలాగే పలు కంపెనీలు ఈ వారంలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి.

స్కైవేస్ ఎయిర్ స‌ర్వీసెస్‌, హైటెక్ ఇంజినీర్స్‌..

స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ రూ.582.80 కోట్ల ఐపీఓ ఆగస్టు 24 నుంచి ఆగస్టు 27 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. బుక్ బిల్ట్ ఇష్యూలో భాగంగా రూ.398.80 కోట్ల విలువైన 2.89 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. అలాగే రూ.184 కోట్ల విలువైన 1.33 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. హైటెక్ ఇంజినీర్స్ సంస్థ రూ.135.73 కోట్ల ఐపీఓను కూడా ఆగస్టు 24న ప్రారంభించనుంది. ఈ ఇష్యూకు బిడ్డింగ్ ఆగస్టు 27న ముగియనుంది. ఇందులో రూ.60 కోట్ల విలువైన 1.13 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. మరోవైపు రూ.75.73 కోట్ల విలువైన 1.43 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. ఈ వారం మెయిన్‌బోర్డ్ విభాగంలో అతిపెద్ద ఐపీఓ సింబయోటెక్ ఫార్మాల్యాబ్‌కు చెందినది. ఈ సంస్థ రూ.1,757 కోట్లను సమీకరించేందుకు ఐపీఓకు వస్తోంది. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 27 వరకు ఈ ఇష్యూ అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ.150 కోట్ల విలువైన 0.15 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. అలాగే రూ.1,607 కోట్ల విలువైన 1.63 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు.

అన్ను ప్రాజెక్ట్స్‌, లుమినో ఇండ‌స్ట్రీస్‌..

అన్ను ప్రాజెక్ట్స్ సంస్థ రూ.175.06 కోట్ల ఐపీఓను ఆగస్టు 25న ప్రారంభించనుంది. ఈ ఇష్యూ ఆగస్టు 28న ముగుస్తుంది. మొత్తం ఇష్యూ రూ.175.06 కోట్ల విలువైన 1.77 కోట్ల తాజా షేర్ల జారీతోనే ఉంటుంది. ఆగస్టు 27న లుమినో ఇండస్ట్రీస్ రూ.700 కోట్ల ఐపీఓతో మార్కెట్‌లోకి రానుంది. ఈ ఇష్యూ ఆగస్టు 31న ముగుస్తుంది. ఇందులో రూ.500 కోట్ల విలువైన 6.10 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. అలాగే రూ.200 కోట్ల విలువైన 2.44 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఎస్‌ఎంఈ విభాగంలోనూ ఈ వారం భారీగా ఐపీఓలు రానున్నాయి. మధుర్ నిట్ క్రాఫ్ట్స్, ఏబీహెచ్ హెల్త్‌కేర్ సంస్థలు ఆగస్టు 24న తమ ఐపీఓలను ప్రారంభించి ఆగస్టు 27న ముగించనున్నాయి. సుమాక్స్ ఇంజినీరింగ్ ఆగస్టు 25న తన ఇష్యూను ప్రారంభించనుంది. క్విక్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్ ఆగస్టు 27న ఐపీఓను ప్రారంభించనుంది.

లిస్టింగ్‌ల సంద‌డి..

కంప్లీట్ స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఇండియా ఐపీఓ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. కంపెనీలు కొత్త మూలధనం కోసం భారత ఈక్విటీ మార్కెట్లను ఆశ్రయించడం, పబ్లిక్ ఆఫర్లలో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం బలంగా కొనసాగుతుండటంతో ఈ భారీ ఐపీఓ క్యాలెండర్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ఇష్యూలతోపాటు లలితా జ్యువెలరీ మార్ట్, హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, సన్‌షైన్ పిక్చర్స్ వంటి కంపెనీలు కూడా ఈ వారంలో స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేయనున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్‌లో కార్యకలాపాలు మరింత జోరందుకోనున్నాయి.

Advertisement
Advertisement