త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధ‌ర‌లు.. ఇన్వెస్ట‌ర్ల‌కు ఇదే మంచి చాన్స్‌..?

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్త‌త‌లు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌డం, చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌క‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న నెల‌కొన‌గా, ఈక్విటీ మార్కెట్ల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం కొనుగోళ్ల జోరు క‌నిపిస్తోంది.

S

Business | Published On Aug 24, 2026, 11.52 am IST

Gold And Silver Prices Today | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధ‌ర‌లు.. ఇన్వెస్ట‌ర్ల‌కు ఇదే మంచి చాన్స్‌..?
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్త‌త‌లు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌డం, చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌క‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న నెల‌కొన‌గా, ఈక్విటీ మార్కెట్ల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం కొనుగోళ్ల జోరు క‌నిపిస్తోంది. బంగారం, వెండి ధ‌ర‌లు గ‌త ప‌ది రోజుల నుంచి వ‌రుస‌గా పెరుగుతూనే ఉన్నాయి. సోమ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.94 శాతం మేర ఎగ‌సి 4,646 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.34 శాతం మేర పెరిగి 69 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1210 పాయింట్లు పెరిగి 1,63,648 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 266 పాయింట్లు త‌గ్గి 2,46,383 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అయితే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,397 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,31, 176 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,63,970 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16,39,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,800 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,030 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,240గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,03,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,293 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.98,344గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,22,930 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,29,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,75,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,750 గా ఉంది.

Advertisement
Advertisement