త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. త‌గ్గిన ముడి చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 224 పాయింట్లు పెరిగి 77,764.98 వద్ద ట్రేడైంది. గత ముగింపు 77,540.83తో పోలిస్తే సూచీ బలమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 50 కూడా 56 పాయింట్లు లాభపడి 24,308.20 వద్ద కొనసాగింది. గత ముగింపు 24,252.00తో పోలిస్తే ఇది 0.23 శాతం పెరుగుదల.

S

Business | Published On Aug 24, 2026, 10.20 am IST

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. త‌గ్గిన ముడి చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 224 పాయింట్లు పెరిగి 77,764.98 వద్ద ట్రేడైంది. గత ముగింపు 77,540.83తో పోలిస్తే సూచీ బలమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 50 కూడా 56 పాయింట్లు లాభపడి 24,308.20 వద్ద కొనసాగింది. గత ముగింపు 24,252.00తో పోలిస్తే ఇది 0.23 శాతం పెరుగుదల. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 77,629.56 వద్ద, నిఫ్టీ 24,285.05 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమై ఆ తర్వాత నెమ్మ‌దిగా ఇంట్రా డే క‌నిష్టాల‌కు చేరుకున్నాయి. నిఫ్టీలో లాభాల జాబితాలో ఇన్ఫోసిస్‌ ముందంజలో నిలిచింది. కంపెనీ షేరు 1.71 శాతం పెరిగి రూ.1,140.20కు చేరింది. హిందాల్కో 1.48 శాతం లాభంతో రూ.1,049.30కు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.42 శాతం పెరిగి రూ.1,321కు చేరాయి. కోల్‌ ఇండియా 1 శాతం లాభపడి రూ.409.25 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.91 శాతం పెరిగి రూ.733.55 వద్ద ట్రేడయ్యాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

మరోవైపు సిప్లా అత్యధికంగా 1.35 శాతం నష్టపోయి రూ.1,412.90కు పడిపోయింది. అపోలో హాస్పిటల్స్‌ 0.94 శాతం తగ్గి రూ.8,611.50కు, గ్రాసిమ్‌ 0.49 శాతం క్షీణించి రూ.3,291.90కు చేరింది. ఎటర్నల్‌ 0.44 శాతం తగ్గి రూ.326.55 వద్ద, టైటాన్‌ 0.43 శాతం నష్టంతో రూ.5,064.20 వద్ద కొనసాగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు సోమ‌వారం స్వ‌ల్పంగా త‌గ్గాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌ల‌లో ఒత్తిడి కొంత‌మేర త‌గ్గింది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.20 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 91 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.36 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 86 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.65 వద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.03 శాతం మేర లాభ‌ప‌డింది.

అప్ర‌మ‌త్తంగానే ఉండాలి..

సోమవారం ట్రేడింగ్‌కు ముందు గిఫ్ట్‌ నిఫ్టీ సుమారు 24,383 పాయింట్ల వద్ద బలంగా ఉండటం మార్కెట్లకు మద్దతుగా నిలిచింది. దీంతో శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు సోమవారం రికవరీ బాట పట్టాయి. ఛాయిస్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ హితేష్‌ టైలర్‌ మాట్లాడుతూ.. సూచీ పెరుగుతున్న స్వల్పకాలిక ట్రెండ్‌లైన్‌, 24,000-24,050 జోన్‌కు పైన కొనసాగుతోందని, దీంతో రికవరీ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. అయితే ఆర్‌ఎస్‌ఐ 49.09 వద్ద న్యూట్రల్‌గా ఉండటం, సూచీ 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కంటే దిగువన ఉండటం వంటి అంశాలు ఇంకా జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయ‌ని తెలిపారు.

Advertisement
Advertisement