త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగిన‌ట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

MLA Mallareddy | రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి పాలు పొంగిన‌ట్టు పొంగుతున్నాడు అని మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి విమ‌ర్శించారు.

S

Telangana | Published On Aug 23, 2026, 9.06 pm IST

MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగిన‌ట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి
Advertisement

MLA Mallareddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి పాలు పొంగిన‌ట్టు పొంగుతున్నాడు అని మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి విమ‌ర్శించారు. బోడుప్పల్‌లో 22A నిషేధిత భూముల బాధితుల సమావేశంలో మ‌ల్లారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు. 24 గంట‌ల్లోగా స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేస్తామ‌ని అంటున్నారు. ప‌రిష్కారం కాక ఫోన్ చేస్తే.. ఆ ఫోన్ కూడా ఎత్త‌డం లేదు. గ‌వ‌ర్న‌మెంట్ అంటే ఎట్ల ఉండాలి. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ప్ర‌జ‌ల మీద ఎవ‌రికీ ప‌ట్టింపు లేదా..? దోచుకోవ‌డం, ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మేనా మీ ప్ర‌భుత్వం ప‌ని. మీరెవ‌రూ భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదు. ఖ‌బ‌డ్దార్.. మ‌న‌కు హ‌రీశ‌న్న‌, కేసీఆర్ ఉన్నారు. రెండేండ్లు ఓపిక ప‌డితే మీ బాధ‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి. ఇంకో ఏడాది ఓపిక ప‌డితే మ‌ళ్లీ మ‌న‌మే వ‌స్తాం. త‌ప్ప‌కుండా కేసీఆర్ సీఎం అవుతారు.. త‌ప్ప‌కుండా మ‌న బాధ‌ల‌న్నీ పోతాయి. కేసీఆర్ మ‌న‌కు భ‌గ‌వంతుడు. పదేండ్లు బంగారు తెలంగాణ చేశారు. భార‌త‌దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా తెలంగాణ‌ను తీర్చిదిద్దారు. ఈ ద‌రిద్రులు వ‌చ్చి మొత్తం ద‌రిద్రం ప‌ట్టించారు. త‌ప్ప‌కుండా వాళ్లు గంగ‌లో క‌లిసిపోత‌రు. డిపాజిట్ రాదు చూడండి ఒక్కొక్క‌డికి అని మ‌ల్లారెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. కాంగ్రెస్ శాపాన్ని ఐదేళ్లు మనం భరించాల్సిందే. గ్యారెంటీలు, హామీల పేరిట ప్రజల్ని నమ్మించి.. నిండా ముంచేశారు. 22A ఒక్కటే కాదు.. ఎన్ని Aలు ఉన్నాయో అన్ని Aలు పెడుతున్నారు. అన్నింటిలో వేలు పెట్టి.. కాంగ్రెస్ వాళ్లు జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement