త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే. దీంతో కేవలం బ్రిటన్ పర్యటనను (London Tour) మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు.

G

Telangana | Published On Aug 24, 2026, 9.07 am IST

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే. దీంతో కేవలం బ్రిటన్ పర్యటనను (London Tour) మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ రైజింగ్ బృందంతో క‌లిసి ప‌ది రోజుల విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సీఎం రేవంత్‌ ఈ నెల 20న లండ‌న్ వెళ్లారు. షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌స్టు 30న అమెరికా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఆయ‌న హైద‌రాబాద్ (Hyderabad) రావాల్సి ఉంది. అయితే, కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందమైన.. సీఎస్ శాంతి కుమారి, రామకృష్ణారావు తదితరుల టీమ్ మాత్రం సీఎం ఆదేశాలతో అమెరికా పర్యటనను కొనసాగిస్తోంది.

కాగా, మంత్రి కొండా సురేఖ వివాదం, అమెరికా ప‌ర్య‌ట‌న‌కు కేంద్రం అనుమ‌తి నిరాక‌రించ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తాను హైద‌రాబాద్ వ‌స్తున్నాన‌ని, అన్నీ మాట్లాడుతాన‌ని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ముఖ్య‌మంత్రి ఏం మాట్లాడుతార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

కేంద్రం నిర్ణయం రాజకీయ కారణాలతోనే జరిగిందని ముఖ్యమంత్రి ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. తన అమెరికా పర్యటనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. లండన్‌లో షెడ్యూల్‌ ప్రకారం అన్ని సమావేశాలు, కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని రేవంత్‌ పేర్కొన్నారు. మూడు రోజులుగా పార్టీ నేతలు, ప్రజల నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత మిగిలిన అంశాలపై పూర్తి వివరాలతో మాట్లాడతానని స్పష్టం చేశారు.

సుష్మిత వ్యాఖ్యలపై స్పందిస్తారా?

ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ అంశం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే స్పందించారు. తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తనకు, పార్టీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకవైపు కేంద్రంతో పర్యటన విషయంలో నెలకొన్న వివాదం.. మరోవైపు సొంత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌కు చేరుకుంటున్న రేవంత్‌రెడ్డి స్పందనపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ వెనుక కారణాలు, సుష్మిత వ్యవహారంపై ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతార‌నే ఉత్కంఠ నెల‌కొన్న‌ది.

Advertisement
Advertisement