Kunamneni Sambasiva Rao | “ఇప్పటి కంటే ఉమ్మడి రాష్ట్రమే నయం.. పవన్ కల్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వాల్సింది” – కూనంనేని సెన్సేషనల్ కామెంట్స్
మక్ధూమ్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సాక్షిగా సీపీఐ నేత కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సభ రద్దు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ఆయన ఏమన్నారంటే.
- మక్ధూమ్ భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఎగురవేసిన కూనంనేని
- తెలంగాణ సాధనలో కమ్యూనిస్టుల పాత్రను చరిత్రలో లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై పెదవి విరుపు
- ప్రస్తుత పరిస్థితుల కంటే ఉమ్మడి రాష్ట్రమే బాగుందన్న భావన కలుగుతోందని కామెంట్స్
- పవన్ కల్యాణ్ సభకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సిందని, ప్రజాస్వామ్యంలో అడ్డుకోవడం సరికాదని స్పష్టీకరణ
Kunamneni Sambasiva Rao | త్రినేత్ర.న్యూస్ : హిమాయత్‌నగర్‌లోని మక్ధూమ్ భవన్‌లో సీపీఐ (CPI) రాష్ట్ర కార్యాలయం వేదికగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర రాజకీయాలు, గత ప్రభుత్వాల తీరు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సభ అనుమతి రద్దు తదితర ఇష్యూలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతోంది
తెలంగాణ కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. "తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కమ్యూనిస్టుల త్యాగాలు మరువలేనివి. ప్రత్యేక తెలంగాణ కోసం తొలి సంతకం చేసింది కూడా సీపీఐ నాయకులే. కానీ, ఇప్పుడు ఆ పోరాటాలను, చరిత్రను మరుగున పడేసేలా కుట్రలు జరుగుతున్నాయి" అని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడిందో, అవి నేటికీ నెరవేరలేదని ఆయన అన్నారు.
ఉమ్మడి రాష్ట్రమే బెస్ట్ అనిపిస్తోంది!
"గత పదేళ్ల బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో ఆంక్షలు, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎక్కువగా ఉండేవి. రెండేళ్ల కాంగ్రెస్ (Congress) పాలనలో కొంత స్వేచ్ఛ వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో ఉద్యమ ఆకాంక్షలు మాత్రం అమలు కావడం లేదు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే.. మనం ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేవాళ్లం కదా అనే భావన కలుగుతోంది" అంటూ కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు
హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ 'నవ నిర్మాణ సభ'కు పోలీసులు పర్మిషన్ క్యాన్సిల్ చేయడంపైనా కూనంనేని స్పందించారు. "ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సభకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇష్యూలో జనసేన (Janasena) నాయకుల అత్యుత్సాహం వల్లే ప్రాంతీయ విభేదాలు వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు పర్మిషన్ నిరాకరించి ఉండొచ్చు. కానీ, తెలంగాణలో ఎవరికైనా తమ వాయిస్ వినిపించే హక్కు ఉంటుంది. రేపు మన సీఎం ఏపీలో సభ పెడితే అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు కదా? ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు" అని కూనంనేని కుండబద్దలు కొట్టారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం నాయకులంతా కలిసి జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..
- ●Pawan Kalyan | తెలంగాణలో జనసేన ఉంటుంది.. నేను తిరుగుతా : పవన్ కల్యాణ్
- ●Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? - బెనిఫిట్ షోలకు పర్మిషన్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ
- ●Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ - జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ

Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..

Pawan Kalyan | తెలంగాణలో జనసేన ఉంటుంది.. నేను తిరుగుతా : పవన్ కల్యాణ్

Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? - బెనిఫిట్ షోలకు పర్మిషన్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..





