Gadari Kishore | రాహుల్ లెక్క మేం నిరసనలు తెలపొద్దా రేవంత్?
Gadari Kishore | ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అని అంటున్న రేవంత్ (Revanth).. తెలంగాణలో ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ప్రశ్నించారు. నిరసనల్లో రాహుల్ (Rahul Gandhi) మహిళా పోలీసులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. ఇక్కడ ప్రతిపక్షం మీద మాత్రం రేవంత్ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు.
- ఢిల్లీలో ఆయన మహిళా పోలీసులతో మిస్ బిహేవ్ చేశారు
- ఇక్కన్నేమో ప్రతిపక్షం మీద కేసులు పెట్టిస్తున్నవ్
- ఎందుకీ ద్వంద్వ నీతి..
- మా మీదికి పోలీసులను ఉసిగొల్పుడు మానుకో ఇగ
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఫైర్
Gadari Kishore | త్రినేత్ర న్యూస్: ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అని అంటున్న రేవంత్ (Revanth).. తెలంగాణలో ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ప్రశ్నించారు. నిరసనల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మహిళా పోలీసులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. ఇక్కడ ప్రతిపక్షం మీద మాత్రం రేవంత్ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ ద్వంద్వ నీతి ఎందుకని ప్రశ్నించారు. ఇకనైనా తమ మీదికి పోలీసులను ఉసిగొల్పడం మానుకోవాలని హితవు పలికారు. తాను ఢిల్లీలో స్వేచ్ఛగా నిరసనలు చెస్తున్నట్టే బీఆర్ఎస్ ఆందోళనలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని రేవంత్ కు రాహుల్ చెప్పాలన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్, రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అసెంబ్లీ ముందు మా ఎమ్మెల్యేల నిరసనలపై కావాలనే లైంగిక వేధింపుల కేసులు పెట్టారు. రాహుల్‌గాంధీకి ఒక న్యాయం.. తెలంగాణలో ఒక న్యాయమా? బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం సర్కార్ నడుపుతుందా.. సర్కస్ నడుపుతుందా? రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకుని నీతులు చెబుతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు. కరెంట్ లేక రైతులు ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్ డీడీలు గతంలో ఐదు వేలు ఉంటే రూ.10 వేలు చేశారు.
కేటీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరు. ఫామ్‌హౌస్‌ల ఆస్తులు అంటూ రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రతిపక్షం పట్ల రేవంత్ అనుసరిస్తున్న వైఖరిని నిలదీయాలి. ఎల్‌వోపీ హుందాతనం రాహుల్ ప్రదర్శించడం లేదు. ప్రియాంక గాంధీ కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీ ధర్నాలో కూర్చుని నీతులు చెబుతున్నారు. రాహుల్ గాంధీలాగే బీఆర్ఎస్ తెలంగాణలో ఆందోళనలు చేపడితే రేవంత్ పోలీసులను ప్రయోగించడం మానుకోవాలి.
కోర్టులకు కూడా నోటీసులు ఇస్తారా?
స్పీకర్ ప్రసాద్ కుమార్ నాకు పరువు నష్టం నోటీసులు పంపారు. స్పీకర్ గౌరవానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. స్పీకర్ దానం నాగేందర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు తప్పు పట్టాయి. వాటికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేస్తారా? రేవంత్ పాలన మీద దృష్టి పెట్టి డైవర్షన్ రాజకీయాలు మానుకుంటే మంచిది అని గ్యాదరి కిశోర్ హితవు పలికారు.
రాహుల్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. పెట్టాల్సి వస్తే రాహుల్ గాంధీపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టాలి. బీజేపీ నేతలు ఓట్ చోరీ చేస్తుంటే రేవంత్ రెడ్డి కరెంటు చోరీ చేస్తున్నాడు. రైతుబంధు చోరీ చేశారు. రైతు బీమా చోరీ చేసాడు. కేసీఆర్ కిట్ చోరీ చేశాడు. రేవంత్ పాలన మొత్తం చోరీ పాలన అయ్యింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు జులూం చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీలో పోలీసులపై జులూం చేశారు. రాహుల్ గాంధీ మా ఎమ్మెల్యేలపై రేవంత్ పెట్టిన అక్రమ కేసులకు సారీ చెప్పాలి.
రాహుల్ నీతులు ఇక్కడ అమలైతలే: నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. రాహుల్ గాంధీ నీతులు రాష్ట్రంలో అమలు కావడం లేదు. .రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కరెంటు సరిగా లేక పంటలు ఎండిపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. సాగునీటి రంగంలో ప్రభుత్వ అలసత్వం రైతులకు శాపంలా మారుతోంది. ఇకనైనా పాలనపై రేవంత్ దృష్టి పెట్టి చిల్లర రాజకీయాలు మానాలి.
ఈసీకి కూడా అధికారం లేదు: ఒంటెద్దు నరసింహ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్
సీఈసీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోంది. సర్ పేరుతో చాలా చోట్ల ఓట్లు తొలగిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసే ఫామ్ రాజ్యాంగ బద్ధంగా నిర్ణయించబడింది. మార్పు చేయడానికి ఎలక్షన్ కమిషన్‌కు కూడా అధికారం లేదు. కొత్త ఓటర్ల నమోదుకు ఫామ్-6, సర్‌లో ఓటు కోల్పోతే వాళ్లు కూడా.. ఫామ్ -6తో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న ఈఆర్‌వోలకు ఎవరికి కూడా ఈసీ నెట్‌తో అనుమతి లేదు. డైరెక్ట్‌గా కేంద్ర ఎన్నికల సంఘంతోనే ఉంది.
రోహింగ్యాల ఓట్లు తీసివేయండి.. మేం వద్దంటలేం. నిజమైన భారతీయ పౌరుల ఓట్లు తీసివేయడానికి హక్కు లేదు. దేశ ఎన్నికల సంఘాన్ని వెనుకేసుకురావడానికి బీజేపీ నేతలకు ఏం సంబంధం? ఇతర పార్టీలపై రాజకీయంగా దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు. ఏ ఆర్టికల్ అడ్డం పెట్టుకుని దేశంలో ఎలాంటి కారణాలు లేకుండా.. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ? సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.
ఈ ప్రెస్‌మీట్ లో బీఆర్ఎస్ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, రామచంద్రు నాయక్, ధర్మేందర్ రెడ్డి, పడాల సతీశ్, మహిపాల్ ముదిరాజ్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Anupama Parameswaran | తెలంగాణ యాస నేర్చుకున్న అనుపమ - బొమ్మరిల్లు లాంటి సినిమా - క్రేజీ కళ్యాణంపై నిర్మాత కామెంట్స్
- ●CM Revanth Reddy | 12న ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం
- ●Land Survey | 125 ఏళ్ల తర్వాత..రాష్ట్రంలో మళ్లీ సమగ్ర భూసర్వే
- ●Group-1 GRL | గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వకుంటే 500 మందితో ఆమరణ దీక్ష
- ●Congress | గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పాకే దుబాయిలో అడుగుపెట్టాలి
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - ఈ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ స్పెషల్

Anupama Parameswaran | తెలంగాణ యాస నేర్చుకున్న అనుపమ - బొమ్మరిల్లు లాంటి సినిమా - క్రేజీ కళ్యాణంపై నిర్మాత కామెంట్స్

CM Revanth Reddy | 12న ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం

Land Survey | 125 ఏళ్ల తర్వాత..రాష్ట్రంలో మళ్లీ సమగ్ర భూసర్వే

Group-1 GRL | గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వకుంటే 500 మందితో ఆమరణ దీక్ష




