DSP Bhimreddy | డీఎస్పీ భీంరెడ్డి నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అనారోగ్యం కారణంగా నో అరెస్ట్
DSP Bhimreddy | పోలీస్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డి (DSP Bhimreddy) అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనారోగ్యం కారణంగా ఆయనను అదుపులోకి తీసుకోవడం లేదని ఏసీబీ (ACB) తెలిసింది.
DSP Bhimreddy | త్రినేత్ర.న్యూస్: పోలీస్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డి (DSP Bhimreddy) అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనారోగ్యం కారణంగా ఆయనను అదుపులోకి తీసుకోవడం లేదని ఏసీబీ (ACB) తెలిసింది. ఆరోగ్యం కుదుటపడ్డాక భీంరెడ్డిని అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు (ACB Raids) ముగిశాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసంతోపాటు, అతనికి సంబంధించిన 16 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. భారీగా బంగారం, వెండి ఆభరణాలు, స్థిర, చరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది.
బెంగళూరు మహానగరంలో భీంరెడ్డికి సంబంధించి ఎకరా వాణిజ్య స్థలం, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. ఆయన పేరిట లభించిన స్థిరాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఒక బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు, వెసెల్లా మెడోస్‌లో ఏసీబీ సోదాల సమయంలో ఏకంగా 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 20 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. రూ.19.91 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. 23 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ఆబ్కారీ శాఖకు సమాచారం అందించారు.
రూ.3.6 లక్షల నగదుతో పాటు పేట్ బషీరాబాద్‌లోని ఓ బినామీ ఇంట్లో మరో రూ.40 లక్షల నగదు లభ్యమైంది. మణికొండ ప్రాంతంలోనే మరో 3,000 చదరపు అడుగుల భూమి కమర్షియల్‌గా ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్ ఉంది. పటాన్‌చెరులోనే మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 1000 గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 2 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. వికారాబాద్ జిల్లా సీసీ కుంట మండలం ముచ్చింతలలో 4.20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.
తాజావార్తలు
- ●Heavy Rain | తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- ●India Coal Power | వేసవి ఎండల ఎఫెక్ట్.. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తే దిక్కు..
- ●Heavy Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు
- ●Venezuela quake | మిరాకిల్.. 8 రోజులుగా 140 టన్నుల శిథిలాల కిందే.. 100 గంటల ఆపరేషన్ తర్వాత సజీవంగా బయటకు
- ●Cristiano Ronaldo | రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్..? పోర్చుగల్ స్టార్ భవిష్యత్‌పై సోదరి కాటియా ఏమన్నదంటే..?
- ●Switzerland Vs Algeria | స్విట్జర్లాండ్ సునాయాస విజయం

Heavy Rain | తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

India Coal Power | వేసవి ఎండల ఎఫెక్ట్.. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తే దిక్కు..

Heavy Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు

Venezuela quake | మిరాకిల్.. 8 రోజులుగా 140 టన్నుల శిథిలాల కిందే.. 100 గంటల ఆపరేషన్ తర్వాత సజీవంగా బయటకు






