త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chicken Curry | పెండ్లి రోజు చికెన్ వండ‌లేద‌ని.. భార్య‌పై దాడి చేసిన భ‌ర్త‌

Chicken Curry | పెండ్లి రోజున ఇంట్లో చిక‌న్ వండ‌లేద‌ని (Chicken Curry) ఓ వ్య‌క్తి త‌న‌ భార్య‌పై దాడి చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బీఎస్ మ‌క్తాలో నివాసం ఉంటున్న ప్ర‌తాప్ (42), దీపిక దంప‌తులు.

G

Hyderabad | Published On Jul 3, 2026, 11.21 am IST

Chicken Curry | పెండ్లి రోజు చికెన్ వండ‌లేద‌ని.. భార్య‌పై దాడి చేసిన భ‌ర్త‌
Advertisement

Chicken Curry | త్రినేత్ర‌.న్యూస్‌: పెండ్లి రోజున ఇంట్లో చిక‌న్ వండ‌లేద‌ని (Chicken Curry) ఓ వ్య‌క్తి త‌న‌ భార్య‌పై దాడి చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బీఎస్ మ‌క్తాలో నివాసం ఉంటున్న ప్ర‌తాప్ (42), దీపిక దంప‌తులు. ప్ర‌తాప్ ప్లంబ‌ర్‌గా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ‌త నెల 26న వారి వివాహ వార్షికోత్స‌వం. ఆ రోజు మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చిన భ‌ర్త‌కు దీపిక భోజ‌నం వ‌డ్డింది. అయితే ప‌ల్లేంలో చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన‌ అత‌డు.. ఈ రోజు పెండ్లి రోజు. నాకు ఇష్ట‌మైన చికెన్ ఎందుకు వండ‌లేదు.. అంటూ ఆమెతో గొడ‌వ‌కు దిగాడు.

ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెర‌గ‌డంతో ఆవేశంతో ప‌క్క‌నే ఉన్న క‌ర్ర‌తో భ‌ర్య త‌ల‌పై బ‌లంగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. గ‌మ‌నించిన స్థానికులు ద‌వాఖాన‌లో చేర్పించారు. ఇటీవ‌ల కోలుకున్న దీపిక‌.. ప్ర‌తాప్‌పై పంజ‌గుట్ట పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.

Advertisement
Advertisement